Telugu Global
Cinema & Entertainment

పవన్ నుంచి మరో సినిమా

రీఎంట్రీ తర్వాత ఒక్కసారిగా స్పీడ్ పెంచాడు పవన్ కల్యాణ్. ఇప్పటికే 2 సినిమాలు ప్రకటించిన ఈ హీరో, ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా కూడా ఎనౌన్స్ చేశాడు. అవును.. పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోంది. దీంతో పవన్ చేతిలో ఉన్న సినిమాల సంఖ్య 3కు చేరింది. గతంలో హరీష్ శంకర్, పవన్ కాంబోలో గబ్బర్ సింగ్ సినిమా వచ్చింది. పవన్ కెరీర్ ను గాడిలో పెట్టిన మూవీ అది. మళ్లీ […]

పవన్ నుంచి మరో సినిమా
X

రీఎంట్రీ తర్వాత ఒక్కసారిగా స్పీడ్ పెంచాడు పవన్ కల్యాణ్. ఇప్పటికే 2 సినిమాలు ప్రకటించిన ఈ హీరో, ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా కూడా ఎనౌన్స్ చేశాడు. అవును.. పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోంది. దీంతో పవన్ చేతిలో ఉన్న సినిమాల సంఖ్య 3కు చేరింది.

గతంలో హరీష్ శంకర్, పవన్ కాంబోలో గబ్బర్ సింగ్ సినిమా వచ్చింది. పవన్ కెరీర్ ను గాడిలో పెట్టిన మూవీ అది. మళ్లీ ఇన్నాళ్లకు ఆ కాంబినేషన్ కలిసింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది. పవన్ వద్ద ఇప్పటికే మైత్రీ అడ్వాన్స్ 5 కోట్ల రూపాయలు ఉంది. ఈ సినిమాకు పవన్ 50 కోట్లు తీసుకుంటున్నట్టు టాక్. అడ్వాన్స్ గా ఇచ్చిన 5 కోట్లు మినహాయించి మిగతా డబ్బును రెమ్యూనరేషన్ గా అందిస్తారన్నమాట.

ప్రస్తుతం పవన్ పింక్ రీమేక్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉంది. దీంతో పాటు క్రిష్ దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మాతగా ఓ సినిమా ప్రారంభించాడు పవన్. మరో 4 రోజుల్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత హరీష్ శంకర్ మూవీ స్టార్ట్ అవుతుంది. మిగతా టెక్నీషియన్స్ వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తారు.

First Published:  1 Feb 2020 5:54 AM GMT
Next Story