Telugu Global
Cinema & Entertainment

నారప్ప కోసం మరో హీరోయిన్

వెంకటేష్ హీరోగా నటిస్తున్న రీమేక్ ప్రాజెక్ట్ నారప్ప. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియమణిని సెలక్ట్ చేశారు. ఇప్పుడు మరో హీరోయిన్ ను కూడా తీసుకునే ఆలోచనలో ఉన్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాలో అమలాపాల్ సెకెండ్ హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉంది. నారప్పలో ముందుగా శ్రియను అనుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో శ్రియ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో ప్రియమణిని తీసుకోవాల్సి వచ్చింది. ఈసారి […]

నారప్ప కోసం మరో హీరోయిన్
X

వెంకటేష్ హీరోగా నటిస్తున్న రీమేక్ ప్రాజెక్ట్ నారప్ప. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియమణిని సెలక్ట్ చేశారు. ఇప్పుడు మరో హీరోయిన్ ను కూడా తీసుకునే ఆలోచనలో ఉన్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాలో అమలాపాల్ సెకెండ్ హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉంది.

నారప్పలో ముందుగా శ్రియను అనుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో శ్రియ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో ప్రియమణిని తీసుకోవాల్సి వచ్చింది. ఈసారి అలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా, ఎలాంటి లీకులు లేకుండా ముందుగానే అమలాపాల్ తో అన్ని విషయాలు మాట్లాడుకుంటున్నారు. అంతా ఓకే అయిన తర్వాత అధికారికంగా ప్రకటించబోతున్నారు.

ప్రస్తుతం అమలాపాల్ తన తండ్రిని కోల్పోయిన దుఃఖంలో ఉంది. ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాల్ని కూడా కొన్నాళ్లు పక్కన పెట్టేసింది. ఇలాంటి టైమ్ లో నారప్పలో నటించడానికి ఆమె అంగీకరిస్తుందా అనేది డౌట్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అనంతపురం జిల్లాలో జరుగుతోంది.

First Published:  31 Jan 2020 8:32 PM GMT
Next Story