Telugu Global
NEWS

సీబీఐ మాజీ జేడీకి... ఇప్పుడు ఐదో దారే దిక్కు

కొంత కాలంగా జనసేనకు అంటీ ముట్టనట్టుగా ఉంటున్న పార్టీ నేత, మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణ.. ఊగిసలాటను వీడి.. వసంతపంచమి ముహూర్తం చూసుకుని మరీ.. పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు ఆయన తర్వాత అడుగులు ఎటువైపు.. అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరికొంత మందేమో.. ఆయనకు నాలుగు దారులు మాత్రం లేవని.. ఐదో దారి చూసుకోవాల్సిందే అని అంచనా వేస్తున్నారు. ఆ నాలుగు దారులూ ఏంటంటే.. ఒకటి.. బీజేపీలోకి వెళ్లడం. ప్రస్తుతం జనసేన పార్టీ బీజేపీతో […]

సీబీఐ మాజీ జేడీకి... ఇప్పుడు ఐదో దారే దిక్కు
X

కొంత కాలంగా జనసేనకు అంటీ ముట్టనట్టుగా ఉంటున్న పార్టీ నేత, మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణ.. ఊగిసలాటను వీడి.. వసంతపంచమి ముహూర్తం చూసుకుని మరీ.. పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు ఆయన తర్వాత అడుగులు ఎటువైపు.. అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరికొంత మందేమో.. ఆయనకు నాలుగు దారులు మాత్రం లేవని.. ఐదో దారి చూసుకోవాల్సిందే అని అంచనా వేస్తున్నారు.

ఆ నాలుగు దారులూ ఏంటంటే.. ఒకటి.. బీజేపీలోకి వెళ్లడం. ప్రస్తుతం జనసేన పార్టీ బీజేపీతో కలిసి రాజకీయ ప్రయాణం చేస్తోంది కాబట్టి.. జనసేన మాజీ నేతగా లక్ష్మీనారాయణ బీజేపీలోకి వెళ్లడం కుదరకపోవచ్చు.

రెండు.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి చేరడం. కానీ.. ఇది కూడా ప్రాక్టికల్ గా వీలు కాదు. జగన్ కేస్తులపై సీబీఐ విచారణ నేపథ్యంలో.. లక్ష్మీనారాయణ సీబీఐ జేడీగా ఉన్నారు కాబట్టి.. ప్రస్తుత అధికార పార్టీలోనూ చేరడం కుదరని పని.

ఇక.. మూడోది.. టీడీపీలో చేరడం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో… టీడీపీలో చేరిక అంటే.. ఆలోచించాల్సిందే అని కొందరంటున్నారు. ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలే.. అధినేత చంద్రబాబుకు అండగా లేరని.. అలాంటప్పుడు టీడీపీలో ఎలా చేరే అవకాశం ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. లాజిక్ ప్రకారం.. ఇదీ కరెక్టే.

నాలుగో ఆప్షన్ చూస్తే.. సొంత పార్టీ పెట్టడం. ఆర్థిక భారం కాబట్టి.. అనుచర గణం అంతగా లేదు కాబట్టి.. ఇదీ వీలు కాని పని.

మిగిలిందల్లా.. లక్ష్మీనారాయణకు ఐదో మార్గమే. అది.. హాయిగా లక్ష్మీ.. నారాయణా… అని తలుచుకుంటూ కాలం గడిపేయడమో.. లేదంటే.. గతంలో లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ ఇచ్చిన ఆఫర్ మేరకు.. లోక్ సత్తా పార్టీని ముందుకు తీసుకుపోవడమో చేయాలి. ఇందులో ఆయన ఏ మార్గాన్ని ఎంచుకుంటారో చూడాలి.

First Published:  30 Jan 2020 9:21 PM GMT
Next Story