Telugu Global
NEWS

ఈ గుసగుసల్లో నిజమెంత?

రాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమాన్ని ఎంతవరకైనా తీసుకువెళ్లేందుకు తెలుగుదేశం అధినేత అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు మండలి రద్దును ఆపేందుకూ.. ఆయన అదిరిపోయే ప్లాన్ వేశారని అంతా అనుకుంటున్నారు. ఇప్పటికే.. తన పార్టీకే చెందిన కొందరు ఎంపీలు బీజేపీలో చేరితే.. చంద్రబాబు అంత సీరియస్ గా స్పందించలేదు. పైగా.. ఆయననే వెళ్లి చేర్పించినట్టు మాట్లాడారు. ఇప్పుడు మండలి విషయంలోనూ ఇలాంటి వ్యూహాన్నే చంద్రబాబు అమలు చేసే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. తన పార్టీకి […]

ఈ గుసగుసల్లో నిజమెంత?
X

రాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమాన్ని ఎంతవరకైనా తీసుకువెళ్లేందుకు తెలుగుదేశం అధినేత అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు మండలి రద్దును ఆపేందుకూ.. ఆయన అదిరిపోయే ప్లాన్ వేశారని అంతా అనుకుంటున్నారు. ఇప్పటికే.. తన పార్టీకే చెందిన కొందరు ఎంపీలు బీజేపీలో చేరితే.. చంద్రబాబు అంత సీరియస్ గా స్పందించలేదు. పైగా.. ఆయననే వెళ్లి చేర్పించినట్టు మాట్లాడారు.

ఇప్పుడు మండలి విషయంలోనూ ఇలాంటి వ్యూహాన్నే చంద్రబాబు అమలు చేసే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. తన పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను బీజేపీలోకి పంపించి.. తద్వారా వారితో కేంద్రంపై ఒత్తిడి పెంచి.. మండలిని బాబుగారు కాపాడేస్తారు.. అంటూ పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ నేత స్పష్టంగా వ్యాఖ్యానించడం.. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇది విన్న జనాలు మాత్రం.. చంద్రబాబు గనక తన పార్టీ ఎమ్మెల్సీలను బీజేపీలోకి పంపితే.. రాజకీయంగా అది టీడీపీకి ఆత్మహత్యాసదృశమే అని స్పష్టం చేస్తున్నారు. ఈ గుసగుసల్లో నిజం లేకపోవచ్చని అంచనా వేస్తున్నారు. కానీ.. చంద్రబాబు గురించి బాగా తెలిసిన వాళ్లు మాత్రం.. ఏదో ఒకటి జరగడం ఖాయమని తేల్చేస్తున్నారు.

First Published:  31 Jan 2020 4:36 AM GMT
Next Story