Telugu Global
NEWS

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ ఫైనల్స్ లో ముగురుజా, కెనిన్

సెమీస్ లోనే హాలెప్, బార్టీ అవుట్ 2020 గ్రాండ్ స్లామ్ సీజన్ తొలి టోర్నీ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ కు రంగం సిద్ధమయ్యింది. అందరి అంచనాలు తలకిందులు చేసి… స్పెయిన్ ప్లేయర్ గార్బిన్ ముగురుజా, అమెరికన్ సంచలనం సోఫియా కెనిన్ టైటిల్ సమరానికి అర్హత సంపాదించారు. మెల్బోర్న్ లోని రాడ్ లేవర్ ఎరీనా సెంటర్ కోర్టు వేదికగా ముగిసిన సెమీఫైనల్స్ లో అన్ సీడెడ్ ముగురుజా 7-6, 7-5తో 4వ సీడ్ సిమోనా హాలెప్ ను […]

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ ఫైనల్స్ లో ముగురుజా, కెనిన్
X
  • సెమీస్ లోనే హాలెప్, బార్టీ అవుట్

2020 గ్రాండ్ స్లామ్ సీజన్ తొలి టోర్నీ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ కు రంగం సిద్ధమయ్యింది. అందరి అంచనాలు తలకిందులు చేసి… స్పెయిన్ ప్లేయర్ గార్బిన్ ముగురుజా, అమెరికన్ సంచలనం సోఫియా కెనిన్ టైటిల్ సమరానికి అర్హత సంపాదించారు.

మెల్బోర్న్ లోని రాడ్ లేవర్ ఎరీనా సెంటర్ కోర్టు వేదికగా ముగిసిన సెమీఫైనల్స్ లో అన్ సీడెడ్ ముగురుజా 7-6, 7-5తో 4వ సీడ్ సిమోనా హాలెప్ ను అధిగమించింది.

మరో సెమీఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ యాష్లీగా బార్టీపై అమెరికా సంచలనం సోఫియా కెనిన్ సంచలన విజయం సాధించడం ద్వారా తన కెరియర్ లో తొలిసారిగా గ్రాండ్ స్లామ్ ఫైనల్లో అడుగుపెట్టింది. 14వ సీడ్ కెనిన్ సైతం 7-6, 7-5తోనే టాప్ సీడ్ బార్టీని అధిగమించడం విశేషం.

First Published:  30 Jan 2020 7:02 PM GMT
Next Story