Telugu Global
NEWS

తుపాను ప్రభావం అంతటా ఉంటుంది.. అయినా విశాఖే బెటర్

ఆంధ్రప్రదేశ్ కు రాజధాని విషయమై ఇటీవల కీలక నివేదికను ప్రభుత్వానికి అందించిన జీఎన్ రావు కమిటీ.. నేరుగా ఇదే విషయమై కీలక వ్యాఖ్యలు చేసింది. విశాఖకు తుపాను ముప్పు అధికమని తెలుగుదేశం సహా.. పలు పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలపై కమిటీకి నేతృత్వం వహించిన రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్ రావు వివరణ ఇచ్చారు. తాము.. సముద్ర తీరానికి 50 కిలోమీటర్ల దూరంలో రాజధానిని ఏర్పాటు చేయాలన్నది నిజమే కానీ.. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖే ఉత్తమం అని కూడా చెప్పిన […]

తుపాను ప్రభావం అంతటా ఉంటుంది.. అయినా విశాఖే బెటర్
X

ఆంధ్రప్రదేశ్ కు రాజధాని విషయమై ఇటీవల కీలక నివేదికను ప్రభుత్వానికి అందించిన జీఎన్ రావు కమిటీ.. నేరుగా ఇదే విషయమై కీలక వ్యాఖ్యలు చేసింది. విశాఖకు తుపాను ముప్పు అధికమని తెలుగుదేశం సహా.. పలు పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలపై కమిటీకి నేతృత్వం వహించిన రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్ రావు వివరణ ఇచ్చారు.

తాము.. సముద్ర తీరానికి 50 కిలోమీటర్ల దూరంలో రాజధానిని ఏర్పాటు చేయాలన్నది నిజమే కానీ.. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖే ఉత్తమం అని కూడా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తుపాన్లు అన్ని ప్రాంతాల్లో వస్తాయన్న ఆయన.. సముద్ర కోతను మాత్రం ఎవరూ ఆపలేరని స్పష్టీకరించారు. అందుకే.. విశాఖ తీరానికి 50 కిలోమీటర్ల దూరంలో రాజధాని ఏర్పాటు చేయాలని అన్నట్టు వివరించారు.

తెలుగుదేశం నేతలు.. తమ నివేదికలను తగలబెట్టడంపైనా జీఎన్ రావు ఆవేదన చెందారు. అన్ని ప్రాంతాలకు చెందిన నిపుణులు తమ కమిటీలో ఉన్నారని.. అన్నీ ఆలోచించాకే తగిన నిర్ణయం తీసుకున్నామని వివరించారు. విశాఖలో కార్యనిర్వాహక రాజధానిని ఏర్పాటు చేస్తే.. మెట్రోపాలిటన్ రీజియన్ ఏర్పాటు చేయాలని సూచించామన్నారు.

తాము సలహాలు మాత్రమే ఇస్తామని.. తుది నిర్ణయం మాత్రం ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

Next Story