Telugu Global
NEWS

జూనియర్ ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్

క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్ర్రేలియాపై భారీవిజయం 2020 అండర్ -19 ప్రపంచకప్ సెమీఫైనల్స్ కు డిఫెండింగ్ చాంపియన్ భారత్ దూసుకెళ్లింది. సౌతాఫ్రికాలోని పోచెఫ్స్ స్ట్ర్రోమ్ వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో హాట్ ఫేవరెట్ భారత్…గత టోర్నీ రన్నరప్ ఆస్ట్ర్రేలియాను 74 పరుగులతో చిత్తు చేసింది. భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన ఫాస్ట్ బౌలర్ కార్తీక్ త్యాగీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. యశస్వి, అన్ కోల్కేర్ హాఫ్ సెంచరీలు… ఈ కీలక పోటీలో టాస్ నెగ్గి […]

జూనియర్ ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్
X
  • క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్ర్రేలియాపై భారీవిజయం

2020 అండర్ -19 ప్రపంచకప్ సెమీఫైనల్స్ కు డిఫెండింగ్ చాంపియన్ భారత్ దూసుకెళ్లింది. సౌతాఫ్రికాలోని పోచెఫ్స్ స్ట్ర్రోమ్ వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో హాట్ ఫేవరెట్ భారత్…గత టోర్నీ రన్నరప్ ఆస్ట్ర్రేలియాను 74 పరుగులతో చిత్తు చేసింది.
భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన ఫాస్ట్ బౌలర్ కార్తీక్ త్యాగీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

యశస్వి, అన్ కోల్కేర్ హాఫ్ సెంచరీలు…

ఈ కీలక పోటీలో టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొన్న ఆస్ట్ర్రేలియా ..పవర్ ఫుల్ బ్యాటింగ్ లైనప్ కలిగిన భారత్ ను 50 ఓవర్లలో 9 వికెట్లకు 233 పరుగుల స్కోరుకే పరిమితం చేయగలిగింది.

ఓపెనర్ యశస్వి జైస్వాల్ 82 బాల్స్ లో 6 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 62, లోయర్ ఆర్డర్ ఆటగాడు 54 బాల్స్ లో 55 పరుగులతో ఫైటింగ్ హాఫ్ సెంచరీ సాధించడంతో.. భారత్ 233 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది.

టాపార్డర్ ఆటగాళ్లలో సక్సేనా 14, తిలక్ వర్మ 2, కెప్టెన్ ప్రియం గర్గ్ 5, జురేల్ 15, వీర్ 25 పరుగులకు అవుట్ కాగా… ఆల్ రౌండర్ రవి బిష్నోయ్ 30 పరుగులకు రనౌట్ గా వెనుదిరిగాడు.

కార్తీక్ త్యాగీ మ్యాజిక్ స్పెల్…

50 ఓవర్లలో 234 పరుగుల టార్గేట్ తో చేజింగ్ కు దిగిన కంగారూ టీమ్…భారత ఫాస్ట్ బౌలర్ కార్తీక్ త్యాగీ పేస్ లో గల్లంతయ్యింది. ఓపెనర్ ఫానింగ్ , మిడిలార్డర్ ఆటగాడు రోవే, లోయర్ ఆటగాడు స్కాట్ మాత్రమే రెండంకెల స్కోరు సాధించగలిగారు.

ఫానింగ్ 127 బాల్స్ లో 7 బౌండ్రీలు, 3 సిక్సర్లతో 75 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచినా ప్రయోజనం లేకపోయింది. కంగారూజట్టు 43.3 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది.

భారత ఫాస్ట్ బౌలర్ కార్తీక్ త్యాగీ 8 ఓవర్లలో 24 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఆకాశ్ సింగ్ కు 3 వికెట్లు, లెగ్ స్పిన్నర్ రవి బిష్నోయ్ కు 1 వికెట్ దక్కాయి. ఈ విజయంతో భారత్ సెమీఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకోగలిగింది.

జూనియర్ ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటికే నాలుగుసార్లు టైటిల్ నెగ్గిన భారత్ కు సెమీఫైనల్స్ చేరడం ఇది 7వసారి కావడం విశేషం.

First Published:  29 Jan 2020 1:00 AM GMT
Next Story