Telugu Global
NEWS

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ సెమీస్ లో స్టార్స్ వార్

జోకోవిచ్ కు ఫెదరర్ సవాల్ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్ లో అతిపెద్ద సమరానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ప్రపంచ రెండో ర్యాంకర్ నొవాక్ జోకోవిచ్, 3వ ర్యాంకర్ రోజర్ ఫెదరర్ ..క్వార్టర్ ఫైనల్స్ విజయం సాధించడంతో…సెమీఫైనల్లో సూపర్ డూపర్ ఫైట్ కు రంగం సిద్ధమయ్యింది. ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ టైటిల్ ను ఇప్పటికే ఏడుసార్లు నెగ్గిన రికార్డు డిఫెండింగ్ చాంపియన్ జోకోవిచ్ దైతే…ఆరుసార్లు విజేతగా నిలిచిన రికార్డు …ఫెదరర్ కు ఉంది. గండం గడచిన ఫెదరర్ […]

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ సెమీస్ లో స్టార్స్ వార్
X
  • జోకోవిచ్ కు ఫెదరర్ సవాల్

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్ లో అతిపెద్ద సమరానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ప్రపంచ రెండో ర్యాంకర్ నొవాక్ జోకోవిచ్, 3వ ర్యాంకర్ రోజర్ ఫెదరర్ ..క్వార్టర్ ఫైనల్స్ విజయం సాధించడంతో…సెమీఫైనల్లో సూపర్ డూపర్ ఫైట్ కు రంగం సిద్ధమయ్యింది.

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ టైటిల్ ను ఇప్పటికే ఏడుసార్లు నెగ్గిన రికార్డు డిఫెండింగ్ చాంపియన్ జోకోవిచ్ దైతే…ఆరుసార్లు విజేతగా నిలిచిన రికార్డు …ఫెదరర్ కు ఉంది.

గండం గడచిన ఫెదరర్

38 ఏళ్ల వయసులో 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్ వేటకు దిగిన ఫెదరర్…క్వార్టర్ ఫైనల్లో 100వ ర్యాంక్ ప్లేయర్ సాండ్ గ్రేన్ తో జరిగిన హోరాహోరీ పోరులో 5 సెట్ల విజయంతో సెమీస్ కు అర్హత సంపాదించాడు. పెదర్ 6-3, 2-6, 2-6, 7-6, 6-3తో విజయం సొంతం చేసుకొన్నాడు.

102 విజయాల ఫెదరర్…

గత 43 సంవత్సరాలలో ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ సెమీస్ చేరిన రెండో అతిపిన్నవయస్కుడైన ఆటగాడిగా ఫెదరర్ రికార్డుల్లో చేరాడు. ఫెదరర్ కు ఆస్ట్ర్రేలియన్ ఓపెన్లో ఇది 102 వ విజయం కావడం మరో రికార్డుగా నిలిచిపోతుంది.

మరోక్వార్టర్ ఫైనల్లో కెనడా ఆటగాడు మిలోస్ రావ్ నిచ్ ను రెండోసీడ్ జోకోవిచ్ 6-4, 6-3, 7-6తో అధిగమించి సెమీ బెర్త్ ఖాయం చేసుకొన్నాడు.

జోకో- ఫెదరర్ 26-23 రికార్డు

రెండోర్యాంకర్ జోకోవిచ్, మూడో ర్యాంకర్ ఫెదరర్ ల ఫేస్ టు ఫేస్ రికార్డుల్లో…జోకోదే పైచేయిగా ఉంది. ప్రస్తుత ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ సెమీస్ లో సైతం ఫెదరర్ పై జోకోనే హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగబోతున్నాడు. ఫెదరర్ 38 సంవత్సరాల వయసులో 5 సెట్ల విజయాలతో నెగ్గుకొంటూ వస్తుంటే…32 ఏళ్ల జోకోవిచ్ మాత్రం వరుస సెట్ల విజయాలతో దూకుడుమీద కనిపిస్తున్నాడు.

First Published:  28 Jan 2020 9:00 PM GMT
Next Story