Telugu Global
NEWS

వృద్ధులకు, దివ్యాంగులకు శుభవార్త.... ఇకపై ఇంటి వద్దకే పెన్షన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వృద్ధులకు, వికలాంగులకు, ఇతర పెన్షన్ లు పొందేవారికి శుభవార్త చెప్పింది. నెలవారీగా ఇచ్చే పెన్షన్ కోసం.. ఇకపై కాళ్లరిగేలా తిరిగి అలసిపోవాల్సిన అవసరం లేకుండా చర్యలు చేపట్టింది. ఫిబ్రవరి 1 నుంచి ఇంటికే పెన్షన్ ను చేరవేసేలా కార్యాచరణ అమలు చేయనుంది. ఈ మేరకు.. సంబంధిత అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. కొత్త పెన్షన్లనూ అదే రోజు నుంచి అందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పెన్షన్ ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం.. […]

వృద్ధులకు, దివ్యాంగులకు శుభవార్త....  ఇకపై ఇంటి వద్దకే పెన్షన్
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వృద్ధులకు, వికలాంగులకు, ఇతర పెన్షన్ లు పొందేవారికి శుభవార్త చెప్పింది. నెలవారీగా ఇచ్చే పెన్షన్ కోసం.. ఇకపై కాళ్లరిగేలా తిరిగి అలసిపోవాల్సిన అవసరం లేకుండా చర్యలు చేపట్టింది.

ఫిబ్రవరి 1 నుంచి ఇంటికే పెన్షన్ ను చేరవేసేలా కార్యాచరణ అమలు చేయనుంది. ఈ మేరకు.. సంబంధిత అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. కొత్త పెన్షన్లనూ అదే రోజు నుంచి అందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

పెన్షన్ ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం.. ఏటా 250 రూపాయల మొత్తాన్ని పెంచనున్నట్టు అధికారంలోకి రాగానే ప్రకటించింది. అలాగే.. గత ప్రభుత్వంలో 39 లక్షలుగా ఉన్న పెన్షనర్ల మొత్తాన్ని.. ఇప్పడు 54 లక్షల 64 వేలకు పెంచింది. వారందరికీ ఇకపై.. ఇంటికే పెన్షన్ మొత్తాన్ని చేర్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది.

ఇవి మాత్రమే కాదు.. మూడో విడతలో భాగంగా వైఎస్ఆర్ కంటివెలుగు కార్యక్రమాన్ని ఫిబ్రవరి 1 నుంచి ఆరు నెలల పాటు కొనసాగించనున్నట్టు తెలిపింది. రేపటి నుంచే దాదాపుగా అన్ని జిల్లాల్లో.. ఇంటివద్దకే ఇసుక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. ఈ పథకాలను ప్రజలు, లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరింది.

First Published:  29 Jan 2020 12:55 AM GMT
Next Story