Telugu Global
NEWS

మండలిని కాదు... అసెంబ్లీనే రద్దు చేయాలంటున్నారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకున్నట్టుగానే శాసనమండలి రద్దుకు నిర్ణయించింది. ఊహాగానాలకు తెర దించింది. ఈ పరిణామంపై సహజంగానే.. తెలుగుదేశం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు.. జగన్ ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. మండలిని కాదు.. అసెంబ్లీనే రద్దు చేయాలంటూ సవాల్ విసిరారు. అలాగే అమరావతిపైనా ప్రజల రెఫరెండం కావాలన్నారు. అందులో నిర్ణయం ఎలా వస్తే.. తాను అలా నడుచుకుంటానని చెప్పారు. ఇక.. టీడీపీకి చెందిన ఇతర నేతలు కూడా ఇదే రీతిన స్పందించారు. […]

మండలిని కాదు... అసెంబ్లీనే రద్దు చేయాలంటున్నారు
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకున్నట్టుగానే శాసనమండలి రద్దుకు నిర్ణయించింది. ఊహాగానాలకు తెర దించింది. ఈ పరిణామంపై సహజంగానే.. తెలుగుదేశం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు.. జగన్ ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. మండలిని కాదు.. అసెంబ్లీనే రద్దు చేయాలంటూ సవాల్ విసిరారు. అలాగే అమరావతిపైనా ప్రజల రెఫరెండం కావాలన్నారు. అందులో నిర్ణయం ఎలా వస్తే.. తాను అలా నడుచుకుంటానని చెప్పారు.

ఇక.. టీడీపీకి చెందిన ఇతర నేతలు కూడా ఇదే రీతిన స్పందించారు. శాసనమండలి రద్దుకు అసెంబ్లీ తీర్మానం చేసినా ఇప్పటికిప్పుడే రద్దు అయ్యే అవకాశం లేదని.. మాజీ మంత్రి యనమల అన్నారు. కనీసం 2, 3 ఏళ్లు పట్టే అవకాశం ఉంటుందన్నారు. కానీ.. కేంద్రం తలుచుకుంటే.. ఇది సంవత్సరాల పని కాదు.. రోజుల్లోనే పూర్తయ్యే విషయం అన్న వాస్తవాన్ని మాత్రం తెలుగుదేశం నేతలు ప్రస్తావించడం లేదని.. వైసీపీ నేతలు అంటున్నారు.

ఇక.. అసెంబ్లీ రద్దు విషయానికి వస్తే.. ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి.. సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పని చేస్తామని స్పష్టం చేస్తున్నారు. మండలి రద్దుపై టీడీపీ నేతల అభ్యంతరాలను తప్పుబడుతున్నారు.

టీడీపీ నేతలు మాత్రం మొదట…. మండలి రద్దు కానేకాదు…. అని బల్లగుద్ది మాట్లాడారు. ఆ తరువాత మండలి రద్దు అయితే ఎక్కువ నష్టపోయేది వైసీపీయే అంటూ మీడియాలో ఊదరగొట్టారు. రాష్ట్రం మండలిని రద్దుచేసినా… ఆ ప్రక్రియ పూర్తి కావడానికి రెండేళ్ళు పడుతుందని, ఈలోగా టీడీపీ వాళ్ళ పదవీకాలం అయిపోతుందని… నష్టపోయేది మాత్రం వైసీపీయేనని నమ్మబలికారు…. ఇవన్నీ చాలవన్నట్లు వైసీపీ బేరసారాలకు దిగిందని కానీ టీడీపీ సభ్యులు లొంగకపోయేసరికి మండలిని రద్దుచేసిందని ఇప్పుడు మాట్లాడుతున్నారు. టీడీపీ నాయకులు… ఎల్లోమీడియా ఎలాంటి ప్రచారాలు చేసినా ముఖ్యమంత్రి జగన్ ఏం మాట్లాడకుండా…. తన పని తాను చేసుకుపోతూ అనుకున్న విధంగా మండలిని రద్దు చేసేశారు.

అయితే చంద్రబాబు మాత్రం మరో అడుగు ముందుకేసి మండలిని కాదు అసెంబ్లీని కూడా రద్దు చేయాలని కోరుతున్నారు. ఈ కోరికలను హేళన చేస్తూ వైసీపీ నాయకులు…. చంద్రబాబు మరికొద్దిరోజుల్లో జగన్ ను దించేసి ముఖ్యమంత్రి పీఠంలో తనను కూర్చోబెట్టాలని కోరతారని ఎద్దేవా చేస్తున్నారు.

First Published:  28 Jan 2020 12:00 AM GMT
Next Story