Telugu Global
NEWS

ఫిబ్రవరిలో కారు డ్రైవర్ మారుబోతున్నారా?

తెలంగాణ సీఎం కేటీఆర్..ముహూర్తం ఖరార్. కారులో షికార్ చేయడమే తరువాయ్…అన్న న్యూస్ ఈమధ్యకాలంలో తెగ చక్కర్లు కొట్టింది. అయితే ఇటీవల కేటీఆర్ ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కేసీఆరే ముఖ్యమంత్రి అని….ఇప్పట్లో తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి రారని ఖరాకండిగా చెప్పారు. దీంతో అందరూ సైలెంట్ అయ్యారు. కానీ మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో మరోసారి కేటీఆర్ సీఎం కావడం ఖాయం అంటూ సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు కేసీఆర్ గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి చేశారని… ఫిబ్రవరిలో […]

ఫిబ్రవరిలో కారు డ్రైవర్ మారుబోతున్నారా?
X

తెలంగాణ సీఎం కేటీఆర్..ముహూర్తం ఖరార్. కారులో షికార్ చేయడమే తరువాయ్…అన్న న్యూస్ ఈమధ్యకాలంలో తెగ చక్కర్లు కొట్టింది.

అయితే ఇటీవల కేటీఆర్ ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కేసీఆరే ముఖ్యమంత్రి అని….ఇప్పట్లో తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి రారని ఖరాకండిగా చెప్పారు. దీంతో అందరూ సైలెంట్ అయ్యారు.

కానీ మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో మరోసారి కేటీఆర్ సీఎం కావడం ఖాయం అంటూ సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు కేసీఆర్ గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి చేశారని… ఫిబ్రవరిలో సీఎంగా కేసీఆర్ ప్లేస్ లో కేటీఆర్ రాబోతున్నారంటూ పొలిటికల్ సర్కిల్స్ లో తెగ వినిపిస్తోంది.

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ త్వరలో సీఎంగా బాధ్యతలు చేపడతారనే ప్రచారం జోరందుకుంది. రాజకీయ వర్గాలతో పాటు సామాన్యులలోనూ ఇదే చర్చ సాగుతోంది. శనివారం మున్సిపల్ , కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమని, అత్యధిక సీట్లు వస్తాయని రాజకీయా వర్గాలు భావిస్తున్నాయి.

పుర ఎన్నికల ప్రచారాన్ని అంతా తానై నడిపించారు కేటీఆర్.. ఆ క్రెడిట్‌ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖాతాలో వేయాలన్నది ఆ పార్టీ హైకమాండ్ భావనగా తెలుస్తోంది. అంతేకాదు ఈ వాదనకు బలం చేకూర్చే విధంగా అటు ప్రతిపక్ష నేతలు కొందరు.. కేటీఆర్‌ ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్నారంటూ ప్రచారం కూడా చేస్తున్నారు.

మున్సిపల్ ఫలితాలు రాగానే కేటీఆర్‌కు పట్టాభిషేకం జరుగుతుందనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. సొంత పార్టీ శ్రేణులే ఈ క్యాంపెయిన్ చేస్తుండటం ఆసక్తి రేపుతోంది. స్వయంగా మంత్రులు, పార్టీ ముఖ్యులు సీఎం కేసీఆర్ తర్వాత కాబోయే తెలంగాణ సీఎం కేటీఆరేనంటూ ప్రచారం హోరెత్తిస్తుననారు. ఇలాంటి ప్రచారం కొత్తేమీ కాదు.

లోక్ సభ ఎన్నికల సమయంలో కూడా టీఆర్ఎస్ కొత్త సారధి కేటీఆర్ అంటూ ఓ ఫీలర్ వదిలింది. సారు.. కారు.. పదహారు అన్న నినాదంతో కేటీఆర్ ప్రచారంలో దూసుకుపోయారు కూడా…కేంద్రంలో కేసీఆర్…రాష్ట్రంలో కేటీఆర్ అన్న క్యాంపెయినూ నడిచింది. కానీ ఎన్నికల్లో తక్కువ సీట్లు రావడంతో….కొన్నాళ్లూ ఈప్రచారానికి బ్రేకులు పడ్డాయి. తర్వాత పంచాయతీ, జెడ్పీ ఎలక్షన్ లలో కేటీఆర్ సీఎం అంశాన్ని తెరపైకి తెచ్చారు. పార్టీ వ్యవహారాలన్నీ ఆయన చుట్టే కేంద్రీకృతమయ్యేలా చేశారు. తాజాగా మున్సిపోల్స్ రావడంతో సీఎం కేటీఆర్ అన్న ప్రచారం మళ్లీ మొదలైంది.

అంతేకాదు ఈమధ్య మంత్రులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు సైతం కేటీఆర్ ను తెగ మోసేస్తున్నారు. ఆయనే మా నెక్స్ట్ సీఎం అంటూ ప్రచారం కూడా చేస్తున్నారు. అంతేకాదు కేటీఆర్ పట్టాభిషేకానికి ముహూర్తం కూడా ఖరారైనట్లు….కేసీఆర్ పుట్టినరోజు అంటే ఫిబ్రవరి 17న కేటీఆర్ ను సీఎం చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి.. కేటీఆర్ కు పట్టాభిషేకం చేస్తారా? లేక గతంలో మాదిరే ప్రచారంతోనే సరిపెడతారా? అన్నది.

First Published:  24 Jan 2020 9:02 PM GMT
Next Story