Telugu Global
Cinema & Entertainment

'డిస్కో రాజా' సినిమా రివ్యూ

రివ్యూ :డిస్కో రాజా రేటింగ్ : 2/5 తారాగణం : రవి తేజ, పాయల్ రాజ్ పుత్, నభా నటేష్,  తాన్యా హోప్, బాబీ సింహ, వెన్నెల కిషోర్, సునీల్,  సత్య,  అన్నపూర్ణ, తదితరులు సంగీతం: ఎస్ ఎస్ థమన్ నిర్మాత : రామ్ తాళ్లూరి దర్శకత్వం : వి ఐ ఆనంద్ వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న రవితేజ ఇప్పుడు ‘డిస్కో రాజా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ వి ఐ ఆనంద్ దర్శకత్వం […]

డిస్కో రాజా సినిమా రివ్యూ
X

రివ్యూ :డిస్కో రాజా
రేటింగ్ : 2/5
తారాగణం : రవి తేజ, పాయల్ రాజ్ పుత్, నభా నటేష్, తాన్యా హోప్, బాబీ సింహ, వెన్నెల కిషోర్, సునీల్, సత్య, అన్నపూర్ణ, తదితరులు
సంగీతం: ఎస్ ఎస్ థమన్
నిర్మాత : రామ్ తాళ్లూరి
దర్శకత్వం : వి ఐ ఆనంద్

వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న రవితేజ ఇప్పుడు ‘డిస్కో రాజా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ వి ఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్, నభా నటేష్, తాన్యా హోప్ లు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాపైనే రవితేజ తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. సరికొత్త కథాంశంతో టీజర్ తోనే ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా తాజాగా ఈరోజు విడుదలైంది.

కథ:

ఓ మనిషి మంచు ప్రాంతంలో హత్యకు గురవుతాడు. కొన్నేళ్ల తర్వాత లడఖ్ లో మెడికల్ స్టూడెంట్స్‌కు అతని శవం దొరుకుతుంది. మెడికల్ స్టూడెంట్స్ ఆ శవం పై ప్రయోగాలు చేస్తారు. చనిపోయిన మనుషులను స్టెమ్ సెల్స్ సహాయంతో బతికించే ఆ ప్రయోగాన్ని ప్రభుత్వం వద్దని వారించినప్పటికీ…. అనాథ శవం, ఎలాంటి సమస్య రాదు అనుకుని అతనిని బతికిస్తారు. తిరిగి ప్రాణం వచ్చింది కానీ అతనికి గతం మాత్రం గుర్తురాలేదు. మరి గతం గుర్తుకు రావడానికి వాళ్ళేం చేశారు? అతను డిస్కో రాజా నేనా? అతని కుటుంబసభ్యులు ఎవరు? డిస్కోరాజాపై సేతు (బాబీ సింహా) ఎందుకు పగను పెంచుకుంటాడు? చివరికి ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు:

చాలా కాలం తర్వాత మళ్లీ రవితేజ ఒక పూర్తి ఎంటర్ టైనింగ్ పాత్రలో కనిపించాడు. ఈ సినిమాలో కొంచెం ఛాలెంజింగ్ పాత్ర అయినప్పటికీ బాగా నటించారు. తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో రవితేజ అభిమానులను మెప్పించాడని చెప్పుకోవాలి.

గ్లామర్ పరంగా మాత్రమే కాక నటన పరంగా కూడా మంచి మార్కులే వేయించుకుంది పాయల్. ఫస్ట్ హాఫ్ లో తాన్య కూడా తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేసింది. బాబీ సింహ నటన ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయింది. సినిమా మొత్తం అదే ఎనర్జీ తో బాబీ సింహ ఒక గ్యాంగ్ స్టార్ గా చాలా బాగా నటించారు.

వెన్నెల కిషోర్ కామెడీ కచ్చితంగా ప్రేక్షకులను నవ్విస్తుంది. చాలా కాలం తర్వాత సునీల్ కి ఈ సినిమాలో బోలెడు వేరియేషన్స్ ఉన్న పాత్ర దక్కింది. అయితే ఆ పాత్ర కి మాత్రం సునీల్ సరిపోలేదు అని చెప్పుకోవచ్చు. సత్య కామెడీ కూడా బాగానే ఉంది.

సాంకేతిక వర్గం:

కాన్సెప్ట్ కొత్తగా ఉన్నప్పటికీ దర్శకుడు వి ఐ ఆనంద్ ఆ కథను డెవెలప్ చేసిన విధానం, చూపించిన పద్దతి చాలా స్లో గా ఉన్నాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో సన్నివేశాలు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవ్వలేకపోయాయి.

మంచి కథను ఎంచుకున్నప్పటికీ… తెరమీద సరిగ్గా చూపించలేకపోయాడు ఈ దర్శకుడు. ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై రామ్ తాళ్ళూరి అందించిన నిర్మాణ విలువలు సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. ఎస్ ఎస్ థమన్ అందించిన సంగీతం కూడా బాగానే ఉంది.

కార్తీక్ ఘట్టమనేని అందించిన విజువల్స్ కూడా బాగున్నాయి. కెమెరా యాంగిల్స్ మరియు విజువల్స్ తో కార్తీక్ బాగానే మెప్పించాడు. నవీన్ ఎడిటింగ్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది.

బలాలు:

నటీనటులు, సరికొత్త కాన్సెప్ట్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

బలహీనతలు:

సెకండ్ హాఫ్, ఎమోషనల్ సన్నివేశాలు

చివరి మాట:

సినిమా చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక అనాధ శవం దొరకడం, దానిపై మెడికల్ స్టూడెంట్స్ ఇంతవరకు ఎప్పుడూ చేయని ప్రయోగాలు చేయడం… చనిపోయిన మనిషి మళ్లీ బ్రతకడం… అతని గతం గుర్తుకు రావడం కోసం చేసే ప్రయత్నాలు వంటి వాటితో సినిమా చాలా ఆసక్తికరంగా సాగుతుంది.

ఫస్ట్ హాఫ్ లో కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పవచ్చు. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ కథను ఒక అనుకోని మరియు కీలకమైన మలుపు తిప్పుతుంది. ఫస్ట్ హాఫ్ ని చాలా బాగా చూపించినప్పటికీ.. సెకండ్ హాఫ్ లో మాత్రం ఒక రోటీన్ రివేంజ్ స్టోరీ గా మలచడం ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంది.

సెకండ్ హాఫ్ చాలా స్లో గా సాగడం, చాలా సన్నివేశాలు ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వకపోవడం సినిమాకి అతి పెద్ద మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు.

ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ బాగానే ఉన్నప్పటికీ… సెకండ్ హాఫ్ కథతో ప్రేక్షకులు కనెక్ట్ అవ్వలేకపోయారు .

బాటమ్ లైన్:

‘డిస్కో రాజా’ సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చిన రొటీన్ రివెంజ్ స్టోరీ

Next Story