Telugu Global
NEWS

బాలయ్యతో రోజా సెల్పీ.. దిష్టిబొమ్మ అంటూ బాలయ్యపై వర్మ సెటైర్లు

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఓ అద్భుతమైన ఘట్టం బుధవారం చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ హీరో నందమూరి బాలక్రిష్ణతో వైసీపీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజా ఓ సెల్ఫీ తీసుకున్నారు. ఈ సెల్ఫీలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఎప్పుడూ వివాదాలతోనే కాలం గడిపే రాంగోపాల్ వర్మ ఈసారి కూడా ఈ బాలయ్య-రోజా సెల్ఫీని ఆడేసుకున్నారు. ట్విట్టర్ లో షేర్ చేసి సెటైర్ల వర్షం కురిపించారు. రోజా అందాన్ని కీర్తిస్తూ.. బాలయ్యను దెప్పిపొడుస్తూ […]

బాలయ్యతో రోజా సెల్పీ.. దిష్టిబొమ్మ అంటూ బాలయ్యపై వర్మ సెటైర్లు
X

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఓ అద్భుతమైన ఘట్టం బుధవారం చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ హీరో నందమూరి బాలక్రిష్ణతో వైసీపీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజా ఓ సెల్ఫీ తీసుకున్నారు. ఈ సెల్ఫీలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే ఎప్పుడూ వివాదాలతోనే కాలం గడిపే రాంగోపాల్ వర్మ ఈసారి కూడా ఈ బాలయ్య-రోజా సెల్ఫీని ఆడేసుకున్నారు. ట్విట్టర్ లో షేర్ చేసి సెటైర్ల వర్షం కురిపించారు. రోజా అందాన్ని కీర్తిస్తూ.. బాలయ్యను దెప్పిపొడుస్తూ రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో సంధించిన పోస్టులు ఇప్పుడు వైరల్ గా మారాయి.

బాలక్రిష్ణను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. ‘సెల్ఫీలో రోజా అందంగా హీరోలా కనిపిస్తున్నారని.. కానీ ఆమె పక్కనే ఉన్న వ్యక్తి ఎవరో అసహ్యంగా ఉన్నారని’ కామెంట్ చేశారు.

ఇక మరో పోస్టులో అయితే రోజా గారి అందాన్ని పక్కనున్న వ్యక్తి పాడుచేస్తున్నాడని.. బాహుశా రోజాకి దిష్టిబొమ్మ కావచ్చు… అంటూ బాలయ్యని ఉద్దేశిస్తూ వర్మ కామెంట్ చేయడం సంచలనంగా మారింది.

మరో పోస్టులో అందమైన రోజా పక్కనే కూర్చొని ఆఫొటోని నాశనం చేసిన ఆ వ్యక్తి ఎవరో మీరు చెప్పగలరా? అంటూ మరో పోస్ట్ చేశాడు. ఈ పోస్టులపై బాలయ్య అభిమానులు మండిపడుతుండగా.. కొందరు మాత్రం ఈ పోస్టులను స్క్రీన్ షాట్ లు తీసి ట్రోల్ చేస్తున్నారు.

First Published:  23 Jan 2020 12:35 AM GMT
Next Story