Telugu Global
NEWS

ప్రపంచకప్ లో భారత్ రెండో గెలుపు

పసికూన జపాన్ పై 10 వికెట్ల విజయం సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న 2020 జూనియర్ ప్రపంచకప్ గ్రూప్ లీగ్ లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. బ్లూమ్ ఫాంటెయిన్ వేదికగా ముగిసిన గ్రూప్- ఏ లీగ్ రెండోరౌండ్ పోటీలో పసికూన జపాన్ ను భారత్ 10 వికెట్లతో చిత్తు చేసింది. ఏకపక్షంగా సాగిన ఈ పోటీలో టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొన్న భారత్…ప్రత్యర్థి జపాన్ ను 22.5 ఓవర్లలో 41 పరుగులకే కుప్పకూల్చింది. […]

ప్రపంచకప్ లో భారత్ రెండో గెలుపు
X
  • పసికూన జపాన్ పై 10 వికెట్ల విజయం

సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న 2020 జూనియర్ ప్రపంచకప్ గ్రూప్ లీగ్ లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది.

బ్లూమ్ ఫాంటెయిన్ వేదికగా ముగిసిన గ్రూప్- ఏ లీగ్ రెండోరౌండ్ పోటీలో పసికూన జపాన్ ను భారత్ 10 వికెట్లతో చిత్తు చేసింది.

ఏకపక్షంగా సాగిన ఈ పోటీలో టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొన్న భారత్…ప్రత్యర్థి జపాన్ ను 22.5 ఓవర్లలో 41 పరుగులకే కుప్పకూల్చింది.

ప్రపంచకప్ లో తొలిసారిగా పాల్గొంటున్న పసికూన జపాన్ ..భారత లెగ్ స్పిన్నర్ రవి బిష్నోయ్ స్పిన్ మాయలో గల్లంతయ్యింది. భారత పేసర్లు కార్తీక్ త్యాగి, ఆకాశ్ సింగ్ కలసి ఐదు వికెట్లు పడగొట్టారు. జపాన్ ఆటగాళ్లలో ఏ ఒక్కరూ రెండంకెల స్కోరు సాధించలేకపోయారు.

సమాధానంగా 42 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కుమార్ కుషాగ్రా కేవలం 4.5 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 42 పరుగులు సాధించారు.

యశస్వి జైస్వాల్ 29, కుశాగ్ర 13 పరుగులతో అజేయంగా నిలిచారు. భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన లెగ్ స్పిన్నర్ రవి బిష్నోయ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

మొత్తం నాలుగుజట్ల గ్రూప్ – ఏ లీగ్ ప్రారంభమ్యాచ్ లో శ్రీలంకను 90 పరుగులతో చిత్తు చేసిన భారత్. రెండోరౌండ్లో జపాన్ పై భారీవిజయం సాధించడం ద్వారా క్వార్టర్ ఫైనల్స్ లో చోటు ఖాయం చేసుకొంది. గ్రూప్ ఆఖరిలీగ్ పోటీలో న్యూజిలాండ్ తో భారత్ తలపడనుంది.

ఇప్పటికే నాలుగుసార్లు ప్రపంచ టైటిల్ నెగ్గిన భారత్ ఐదోసారి విశ్వవిజేతగా నిలవాలన్న పట్టుదలతో ఉంది.

First Published:  21 Jan 2020 8:58 PM GMT
Next Story