Telugu Global
NEWS

అక్లాండ్ లో విరాట్ సేన పాగా

న్యూజిలాండ్ లో ఆరువారాల పర్యటన షురూ కొత్తసంవత్సరంలో తొలి విదేశీ పర్యటన కోసం విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టు న్యూజిలాండ్ సిటీ అక్లాండ్ చేరుకొంది. ముంబై నుంచి బయలుదేరి 15 గంటల ప్రయాణం తర్వాత కివీ ల్యాండ్ లో విరాట్ అండ్ కో అడుగుపెట్టారు. 5 టీ-20లు, 3 వన్డేలు, 2 టెస్టులు… భారతజట్టు తన ఆరువారాల పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ తో ఐదు టీ-20లు, మూడు వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో తలపడనుంది. […]

అక్లాండ్ లో విరాట్ సేన పాగా
X
  • న్యూజిలాండ్ లో ఆరువారాల పర్యటన షురూ

కొత్తసంవత్సరంలో తొలి విదేశీ పర్యటన కోసం విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టు న్యూజిలాండ్ సిటీ అక్లాండ్ చేరుకొంది. ముంబై నుంచి బయలుదేరి 15 గంటల ప్రయాణం తర్వాత కివీ ల్యాండ్ లో విరాట్ అండ్ కో అడుగుపెట్టారు.

5 టీ-20లు, 3 వన్డేలు, 2 టెస్టులు…

భారతజట్టు తన ఆరువారాల పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ తో ఐదు టీ-20లు, మూడు వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో తలపడనుంది. అక్లాండ్ చేరిన వెంటనే భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ…శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ లతో కలసి దిగిన ఫోటోను ఇన్ స్టా గ్రామ్ ద్వారా పోస్ట్ చేస్తూ…విదేశీ గడ్డపై సమరానికి తాము సిద్ధమన్న సందేశాన్ని ఉంచాడు.

గత ఏడాది న్యూజిలాండ్ లో పర్యటించిన సమయంలో భారత జట్టు 4-1తో వన్డే సిరీస్ నెగ్గినా…టీ-20 సిరీస్ ను మాత్రం 1-2తో కోల్పోవాల్సి వచ్చింది.

ధావన్, ఇశాంత్ అవుట్…

న్యూజిలాండ్ పర్యటన ప్రారంభానికి ముందే భారత్ కు డబుల్ షాక్ తగిలింది. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ భుజం గాయంతోనూ, సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ కాలిమడమ గాయంతోనూ జట్టుకు దూరమయ్యారు.

శిఖర్ ధావన్ కు బదులుగా టీ-20 సిరీస్ కు సంజు శాంసన్ ను, వన్డే సిరీస్ కు పృథ్వీ షాను ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. మరోవైపు డాషింగ్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాను సైతం ఫిట్ నెస్ కారణాలతో ఎంపిక సంఘం పక్కన పెట్టింది.

వెన్నెముక శస్త్రచికిత్స కారణంగా గత నాలుగుమాసాలుగా క్రికెట్ కు దూరమైన హార్థిక్ పాండ్యాను న్యూజిలాండ్ తో టీ-20, వన్డే సిరీస్ లకు ఎంపిక చేసిన టీమ్ మేనేజ్ మెంట్..అతను నూటికి నూరుశాతం ఫిట్ నెస్ తో లేడని గ్రహించి పక్కన పెట్టింది. బరోడా తరపున దేశవాళీ క్రికెట్ మ్యాచ్ ఆడిన తర్వాతే హార్థిక్ పాండ్యాను భారతజట్టులోకి తీసుకోవాలని నిర్ణయించింది.

First Published:  21 Jan 2020 9:09 PM GMT
Next Story