Telugu Global
Cinema & Entertainment

విరాటపర్వం అప్ డేట్స్

రానా, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా విరాటపర్వం. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఫ్రెష్ షెడ్యూల్ కేరళలో మొదలైంది. హీరోహీరోయిన్లతో పాటు సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న ప్రియమణిపై కేరళలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకు హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలను పేరుపొందిన హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ స్టీఫెన్ రిచర్ ఆధ్వర్యంలో చిత్రీకరించనున్నారు. డాని సాంచెజ్-లోపెజ్ సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో నక్సలిజం కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది విరాటపర్వం […]

విరాటపర్వం అప్ డేట్స్
X

రానా, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా విరాటపర్వం. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఫ్రెష్ షెడ్యూల్ కేరళలో మొదలైంది. హీరోహీరోయిన్లతో పాటు సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న ప్రియమణిపై కేరళలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

ఈ సినిమాకు హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలను పేరుపొందిన హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ స్టీఫెన్ రిచర్ ఆధ్వర్యంలో చిత్రీకరించనున్నారు. డాని సాంచెజ్-లోపెజ్ సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో నక్సలిజం కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది విరాటపర్వం సినిమా. ఈ సినిమాలో కూడా తెలంగాణ యాసలో మాట్లాడబోతోంది సాయిపల్లవి.

సురేష్ బాబు, చెరుకూరి సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది సమ్మర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలో రానా నక్సలైట్ గా కనిపించబోతున్నాడు.

First Published:  20 Jan 2020 12:17 PM GMT
Next Story