Telugu Global
Cinema & Entertainment

థమన్ తో మహేష్... దేవీశ్రీ ప్రసాద్ కు గుడ్ బై చెప్పబోతున్నాడా?

మొన్నటి వరకూ టాలీవుడ్ నంబర్ 1 సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్. దేవీని కొట్టే మొనగాడే లేడనుకున్నారు. కానీ ఈ సంక్రాంతితో దేవీశ్రీ నంబర్ 1 ర్యాంకు పడిపోయింది. ఆ స్థానంలోకి ‘అల వైకుంఠపురం’ సినిమాతో థమన్ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. సంక్రాంతికి దేవీ శ్రీ ‘సరిలేరు నీకెవ్వరు’ పాటలు సోసోగా ఫ్లాప్ అవ్వగా.. థమన్ మాత్రం ‘అల వైకుంఠపురం’తో అద్భుతమే చేశాడు. దీంతో ఇప్పుడు స్టార్ హీరోలంతా థమన్ వెంటపడుతున్నారు. తాజాగా దేవీశ్రీ […]

థమన్ తో మహేష్... దేవీశ్రీ ప్రసాద్ కు గుడ్ బై చెప్పబోతున్నాడా?
X

మొన్నటి వరకూ టాలీవుడ్ నంబర్ 1 సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్. దేవీని కొట్టే మొనగాడే లేడనుకున్నారు. కానీ ఈ సంక్రాంతితో దేవీశ్రీ నంబర్ 1 ర్యాంకు పడిపోయింది. ఆ స్థానంలోకి ‘అల వైకుంఠపురం’ సినిమాతో థమన్ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

సంక్రాంతికి దేవీ శ్రీ ‘సరిలేరు నీకెవ్వరు’ పాటలు సోసోగా ఫ్లాప్ అవ్వగా.. థమన్ మాత్రం ‘అల వైకుంఠపురం’తో అద్భుతమే చేశాడు. దీంతో ఇప్పుడు స్టార్ హీరోలంతా థమన్ వెంటపడుతున్నారు.

తాజాగా దేవీశ్రీ ప్రసాద్ తో వరుసగా సినిమాలు చేసిన మహేష్ బాబు కూడా దేవీకి గుడ్ బై చెప్పడానికి రెడీ అవుతున్నాడట.. వంశీ పైడిపల్లితో మహేష్ బాబు తీయబోయే తర్వాత చిత్రానికి థమన్ తీసుకున్నట్టు సమాచారం. సరిలేరు సినిమాకు దేవీ శ్రీ ఇచ్చిన సంగీతం ఏమాత్రం వర్కవుట్ కాకపోవడంతో మహేష్-వంశీలు థమన్ తీసుకోవాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

సరిలేరు సినిమాకు మ్యూజిక్ మైనస్ గా మారింది. అదే అల వైకుంఠపురం సినిమాకు మ్యూజిక్ ద్వారా సగం పబ్లిసిటీ వచ్చింది. ఈ నేపథ్యంలోనే థమన్ ను తీసుకోవాలని మహేష్ బాబు అనుకున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

First Published:  20 Jan 2020 5:20 AM GMT
Next Story