Telugu Global
NEWS

తల్లిగా టైటిల్ నెగ్గిన భారత తొలి మహిళ

సానియా-నాడియా జోడీకి హోబర్ట్ టైటిల్ భారత మహిళా టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ సానియా మీర్జా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకొంది. తల్లిహోదాలో అంతర్జాతీయ డబుల్స్ టైటిల్ సాధించిన తొలి భారత మహిళగా రికార్డుల్లో చేరింది. ఓ బిడ్డకు జన్మనివ్వడం కోసం గత రెండుసంవత్సరాలుగా టెన్నిస్ కు దూరంగా ఉన్న సానియా..పునరాగమనాన్ని గొప్పగా మొదలుపెట్టింది. మరికొద్దిరోజుల్లో ప్రారంభమయ్యే ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ కు సన్నాహకంగా…ఉక్రెయిన్ ప్లేయర్ నాడియా కిచెనోవ్ తో జంటగా హోబర్ట్ ఓపెన్ మహిళల డబుల్స్ బరిలోకి దిగిన […]

తల్లిగా టైటిల్ నెగ్గిన భారత తొలి మహిళ
X
  • సానియా-నాడియా జోడీకి హోబర్ట్ టైటిల్

భారత మహిళా టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ సానియా మీర్జా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకొంది. తల్లిహోదాలో అంతర్జాతీయ డబుల్స్ టైటిల్ సాధించిన తొలి భారత మహిళగా రికార్డుల్లో చేరింది.

ఓ బిడ్డకు జన్మనివ్వడం కోసం గత రెండుసంవత్సరాలుగా టెన్నిస్ కు దూరంగా ఉన్న సానియా..పునరాగమనాన్ని గొప్పగా మొదలుపెట్టింది. మరికొద్దిరోజుల్లో ప్రారంభమయ్యే ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ కు సన్నాహకంగా…ఉక్రెయిన్ ప్లేయర్ నాడియా కిచెనోవ్ తో జంటగా హోబర్ట్ ఓపెన్ మహిళల డబుల్స్ బరిలోకి దిగిన సానియాజోడీ విజేతగా నిలిచారు.

టైటిల్ సమరంలో చైనాజంట పెంగ్- జాంగ్ పై 6-4, 6-4తో విజయం సాధించడంతోపాటు ..తమ తొలిప్రయత్నంలోనే ట్రోఫీ అందుకోగలిగారు. ఏడాదిక్రితమే ఓ మగబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత నుంచి సానియా పూర్తిపిట్ నెస్ కోసం రోజుకు నాలుగుగంటల పాటు శ్రమిస్తూ వచ్చింది.

తన కెరియర్ రెండో ఇన్నింగ్స్ తొలిటోర్నీలో కాస్త భయపడ్డానని…నాడియాతో జంటగా తొలిటోర్నీలోనే ట్రోఫీ అందుకోడంతో ఆత్మవిశ్వాసం పెరిగిందని, 27 మాసాల సుదీర్ఘవిరామం తర్వాత తిరిగి విన్నర్ గా నిలవడం తనకు పట్టలేని ఆనందం కలిగించిందని పొంగిపోతూ చెప్పింది.

అమ్మానాన్నలతో పాటు తన కుమారుడు ఇజాన్ సమక్షంలో డబుల్స్ ట్రోఫీ అందుకోడం ఓ మధురానుభవమని ప్రకటించింది.

33 సంవత్సరాల సానియా మీర్జాకు తన కెరియర్ లో ఆరు గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిల్స్ సాధించిన అరుదైన రికార్డు ఉంది.

First Published:  19 Jan 2020 11:16 AM GMT
Next Story