Telugu Global
NEWS

నాగబాబు రిటైర్ మెంట్ పై అంబటి పంచ్...

జబర్ధస్త్ నుంచి వైదొలిగి వేరు కుంపటి పెట్టుకున్న మెగా బ్రదర్ నాగబాబు తాజాగా నవ్వుల షోకు గ్యాప్ ఇచ్చి రాజకీయాలపై దృష్టి పెట్టారు. వైసీపీ నాయకులను టార్గెట్ చేసి వరుస ట్వీట్లు చేశారు. ‘జీరోకు విలువలేదని వైసీపీ నేతలు అంటున్నారని.. సైన్స్, మ్యాథ్స్, కంప్యూటర్స్ ఇలా చాలా అభివృద్ధి చెందాయంటే జీరోనే కారణమని అభిప్రాయపడ్డారు. జీరో విలువ తెలియని పనికిరాని వెధవలు వైసీపీ నేతలు ’ అని విమర్శించారు. దీనిపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. […]

జబర్ధస్త్ నుంచి వైదొలిగి వేరు కుంపటి పెట్టుకున్న మెగా బ్రదర్ నాగబాబు తాజాగా నవ్వుల షోకు గ్యాప్ ఇచ్చి రాజకీయాలపై దృష్టి పెట్టారు. వైసీపీ నాయకులను టార్గెట్ చేసి వరుస ట్వీట్లు చేశారు.

‘జీరోకు విలువలేదని వైసీపీ నేతలు అంటున్నారని.. సైన్స్, మ్యాథ్స్, కంప్యూటర్స్ ఇలా చాలా అభివృద్ధి చెందాయంటే జీరోనే కారణమని అభిప్రాయపడ్డారు. జీరో విలువ తెలియని పనికిరాని వెధవలు వైసీపీ నేతలు ’ అని విమర్శించారు.

దీనిపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. ‘నేను తోకలేని పిట్ట చిత్రంలో నటించాను. నటుడిగా విఫలమయ్యాను.. సినిమాల నుంచి రిటైర్ అయ్యాను. మీరు రాజకీయాల్లో విఫలమయ్యారు? ఎప్పుడు రిైటర్ అవుతారు నాగబాబు ?’ అంటూ కౌంటర్ ఇచ్చారు.

ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ పై కూడా ట్వీట్ తో దిమ్మదిరిగేలా చేశారు అంబటి రాంబాబు. పవన్ రాజకీయ ప్రస్తానంలో ఎంతో మంది రాజకీయ నాయకులతో పొత్తు పెట్టుకున్నారని.. ఇప్పుడు బీజేపీతోనూ కలకాలం సాగుతుందనేది డౌట్ అంటూ ఆయన ఫొటోలు పోస్ట్ చేశారు.

పూటకో పార్టీతో పవన్ కళ్యాణ్ దోస్తీ చేస్తాడంటూ ఆయన కలిసిన రాజకీయ నేతలందరి ఫొటోలను షేర్ చేసి ఎండగట్టారు.

First Published:  19 Jan 2020 11:14 AM GMT
Next Story