Telugu Global
NEWS

హోబర్ట్ ఓపెన్ డబుల్స్ ఫైనల్లో సానియాజోడీ

అమ్మహోదాలో సానియాకు తొలిఫైనల్స్ అంతర్జాతీయ టెన్నిస్ లో భారత డబుల్స్ స్టార్ సానియా మీర్జా …రీ-ఎంట్రీలోనే తొలి ఫైనల్స్ కు అర్హత సంపాదించింది. ఓ బిడ్డకు తల్లిగా తొలి ఫైనల్స్ చేరిన తల్లిగా భారత్ తరపున రికార్డు సొంతం చేసుకొంది. మాతృత్వం కోసం గత రెండేళ్లుగా టెన్నిస్ నుంచి విరామం తీసుకొన్న సానియా 2020 సీజన్ ద్వారా పునరాగమనం చేసింది. ఆస్ట్ర్రేలియన్ మహిళల డబుల్స్ కు సన్నాహాలలో భాగంగా…ఉక్రెయిన్ ప్లేయర్ నాడియా కిచెనాక్ తో జంటగా… హోబర్ట్ ఇంటర్నేషనల్ టోర్నీ […]

హోబర్ట్ ఓపెన్ డబుల్స్ ఫైనల్లో సానియాజోడీ
X
  • అమ్మహోదాలో సానియాకు తొలిఫైనల్స్

అంతర్జాతీయ టెన్నిస్ లో భారత డబుల్స్ స్టార్ సానియా మీర్జా …రీ-ఎంట్రీలోనే తొలి ఫైనల్స్ కు అర్హత సంపాదించింది. ఓ బిడ్డకు తల్లిగా తొలి ఫైనల్స్ చేరిన తల్లిగా భారత్ తరపున రికార్డు సొంతం చేసుకొంది.

మాతృత్వం కోసం గత రెండేళ్లుగా టెన్నిస్ నుంచి విరామం తీసుకొన్న సానియా 2020 సీజన్ ద్వారా పునరాగమనం చేసింది. ఆస్ట్ర్రేలియన్ మహిళల డబుల్స్ కు సన్నాహాలలో భాగంగా…ఉక్రెయిన్ ప్లేయర్ నాడియా కిచెనాక్ తో జంటగా… హోబర్ట్ ఇంటర్నేషనల్ టోర్నీ బరిలోకి దిగిన సానియాజోడీ గట్టి పోటీ ఎదుర్కొని తొలివిజయంతో క్వార్టర్ ఫైనల్స్ చేరుకోగలిగారు.

గంటా 41 నిముషాలపాటు సాగిన పోరులో సానియా జోడీ 2-6, 7-6, 10-3తో ఒకెసానా- మియు కాటోల జంటను అధిగమించగలిగారు. 2017లో చివరిసారిగా చైనా ఓపెన్ డబుల్స్ లో పాల్గొన్న తర్వాత…సానియా కెరియర్ లో ఇదే తొలివిజయం కావడం విశేషం.

సెమీఫైనల్లో చోటు కోసం జరిగే క్వార్టర్ ఫైనల్లో సైతం సానియా జోడీ…వానియా కింగ్- క్రిస్టినా మెక్ హోల్ జోడీపై విజయం సాధించడం ద్వారా ఫైనల్స్ చేరుకోగలిగారు.

సెమీస్ లో వరుససెట్ల విజయం…

సెమీఫైనల్లో జిడానెస్క్- బుడానోవాజోడీపై సానియా-నాడియా జంట 7-6, 6-2తో విజయం సాధించడం ద్వారా టైటిల్ సమరానికి సిద్దమయ్యారు.

First Published:  17 Jan 2020 9:00 PM GMT
Next Story