Telugu Global
NEWS

27మంది క్రికెటర్లకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు

గ్రేడ్-ఏ ప్లస్ క్రికెటర్లుగా కొహ్లీ,రోహిత్, బుమ్రా ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు..2020 సీజన్ కు సెంట్రల్ కాంట్రాక్టులను ప్రకటించింది. టెస్ట్, వన్డే, టీ-20 ఫార్మాట్లలో భారత ప్రధాన ఆటగాళ్లు మొత్తం 27 మందికి నాలుగు గ్రేడ్లుగా కాంట్రాక్టులను ఖరారు చేసింది. త్రీ-ఇన్-వన్ లో ముగ్గురే… సాంప్రదాయ టెస్ట్, ఇన్ స్టంట్ వన్డే, ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లలో భారత్ కు కీలక ఆటగాళ్లుగా ఉన్న కెప్టెన్ విరాట్ కొహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, యార్కర్ల […]

27మంది క్రికెటర్లకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు
X
  • గ్రేడ్-ఏ ప్లస్ క్రికెటర్లుగా కొహ్లీ,రోహిత్, బుమ్రా

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు..2020 సీజన్ కు సెంట్రల్ కాంట్రాక్టులను ప్రకటించింది. టెస్ట్, వన్డే, టీ-20 ఫార్మాట్లలో భారత ప్రధాన ఆటగాళ్లు మొత్తం 27 మందికి నాలుగు గ్రేడ్లుగా కాంట్రాక్టులను ఖరారు చేసింది.

త్రీ-ఇన్-వన్ లో ముగ్గురే…

సాంప్రదాయ టెస్ట్, ఇన్ స్టంట్ వన్డే, ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లలో భారత్ కు కీలక ఆటగాళ్లుగా ఉన్న కెప్టెన్ విరాట్ కొహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రాలను మాత్రమే గ్రేడ్-ఏ ప్లస్ కాంట్రాక్టు ఇచ్చింది. ఈ ముగ్గురు ఆటగాళ్లు మ్యాచ్ ఫీజులు కాకుండా ఏడాదికి 7 కోట్ల రూపాయల చొప్పున సెంట్రల్ కాంట్రాక్టు కింద గ్యారెంటీ మనీ అందుకోనున్నారు.

గ్రేడ్- ఏలో రాహుల్ కు చోటు…

భారత యువఓపెనర్ కెఎల్ రాహుల్ కు ఏడాదికి 5 కోట్ల రూపాయల గ్రేడ్-ఏలో తొలిసారిగా చోటు దక్కింది. రవీంద్ర జడేజా, చతేశ్వర్ పూజారా, భువనేశ్వర్ కుమార్, అజింక్యా రహానే, శిఖర్ ధావన్, మహ్మద్ షమీ, ఇశాంత్ శర్మ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్ గ్రేడ్-ఏ కాంట్రాక్టులు సొంతం చేసుకోగలిగారు.

గ్రేడ్-బీలో ఐదుగురికి చోటు..

ఏడాదికి 3 కోట్ల రూపాయల గ్రేడ్ -బీ కాంట్రాక్టు అందుకొన్న క్రికెటర్లలో లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహాల్, ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్, ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఉన్నారు.

గ్రేడ్-సీ లో 9 మంద్రి క్రికెటర్లు

ఏడాదికి కోటిరూపాయల గ్రేడ్- సీ కాంట్రాక్టులో మొత్తం తొమ్మిదిమంది క్రికెటర్లు చోటు సంపాదించారు. కేదార్ జాదవ్, మనీష్ పాండే, హనుమ విహారీ, నవ్ దీప్ సైనీ, దీపక్ చహార్, శార్దూల్ ఠాకూర్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు.

ఈ కాంట్రాక్టు 2019 అక్టోబర్ నుంచి 2020 సెప్టెంబర్ వరకూ వర్తించనుంది. మహిళల క్రికెటర్లతో పోల్చిచూస్తే భారత పురుష క్రికెటర్లు 1000 శాతం ఎక్కువగా కాంట్రాక్టు మనీ అందుకొంటున్నారు.

First Published:  17 Jan 2020 1:34 AM GMT
Next Story