Telugu Global
NEWS

అప్పుడు అలా... ఇప్పుడు ఇలానా?... చంద్రబాబుకు ముద్రగడ లేఖ

”తొమ్మిదిన్నరేళ్లు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశా. పధ్నాలుగేళ్లు ప్రతిపక్ష నేతగా పని చేశా. అధికారంలో ఉన్నప్పుడు టెక్నాలజీ తీసుకొచ్చా. మొబైల్స్ నేనే తీసుకొచ్చా. హైదరాబాద్ లో సైబరాబాద్ ను నేనే కట్టా. అమరావతిని అలాగే ప్రపంచ రాజధానిగా చేస్తా” అంటూ.. సమయం, సందర్భం లేకుండా మాట్లాడ్డం తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు చాలా కాలంగా ఉన్న అలవాటే. అది ఎంతగా అంటే.. తాను క్రీడలను ప్రోత్సహిస్తేనే.. సింధు, సైనా లాంటి వారు పతకాలు సాధిస్తున్నారని.. అలాంటి క్రీడాకారులతో […]

అప్పుడు అలా... ఇప్పుడు ఇలానా?... చంద్రబాబుకు ముద్రగడ లేఖ
X

”తొమ్మిదిన్నరేళ్లు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశా. పధ్నాలుగేళ్లు ప్రతిపక్ష నేతగా పని చేశా. అధికారంలో ఉన్నప్పుడు టెక్నాలజీ తీసుకొచ్చా. మొబైల్స్ నేనే తీసుకొచ్చా. హైదరాబాద్ లో సైబరాబాద్ ను నేనే కట్టా. అమరావతిని అలాగే ప్రపంచ రాజధానిగా చేస్తా” అంటూ.. సమయం, సందర్భం లేకుండా మాట్లాడ్డం తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు చాలా కాలంగా ఉన్న అలవాటే. అది ఎంతగా అంటే.. తాను క్రీడలను ప్రోత్సహిస్తేనే.. సింధు, సైనా లాంటి వారు పతకాలు సాధిస్తున్నారని.. అలాంటి క్రీడాకారులతో పతకాలు తెప్పించింది తానేననీ చెప్పుకునేంత స్థాయికి ఆయన స్వీయ ప్రశంసలు దిగజారాయి.

తాజాగా.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబుకు రాసిన లేఖ నేపథ్యంలో.. ఇవన్నీ చర్చకు వచ్చాయి. చంద్రబాబు తన పాలన గురించి ఇంతలా కామెడీగా చెప్పడమే కాదు.. పాలనా పరంగా.. ఎన్ని రకాల వ్యవహారాలు నడిపించారో అన్నదానిపై.. రకరకాల వార్తలు కూడా వచ్చాయి.

వీటన్నింటినీ తట్టుకుని నిలిచి గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం.. జగన్ ముఖ్యమంత్రి అవడం కూడా చకచకా జరిగిపోయాయి.

తర్వాత అమరావతి వ్యవహారం, రాజధానిగా మూడు ప్రాంతాల ఎంపిక ప్రతిపాదనలు వివాదాస్పదమయ్యాయి. ఈ సందర్భాన్ని కూడా.. చంద్రబాబు రాజకీయం చేసినంతగా ఎవరూ చేయలేదంటే అతిశయోక్తి కానే కాదు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలపై.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తీవ్రంగా స్పందించారు. ఓ రకంగా చెప్పాలంటే.. తన ప్రశ్నలతో చంద్రబాబుకు బహిరంగ లేఖ రాసి ఇరుకున పెట్టారు.

చంద్రబాబుుకు ముద్రగడ వేసిన కొన్ని ప్రశ్నలను ఆయన మాటల్లోనే గమనిస్తే.. జనం కూడా ఈ విషయాలను సీరియస్ గానే ఆలోచిస్తారు. కాపు ఉద్యమం జరిగినప్పుడు.. నేతలను బయటికి రాకుండా హౌజ్ అరెస్టులు చేయడాలు.. తర్వాత కాపు విద్యార్థులు బయటికి రాకుండా ఉండేందుకు చర్యలు.. పోరాటం చేసిన విద్యార్థులపై కేసులు పెట్టాల్సి వస్తుందని బెదిరింపులు.. ఆంగ్లేయుల పాలన కంటే ఎక్కువ అరాచకాలు చేయలేదా బాబుగారూ.. అంటూ ముద్రగడ అడిగిన తీరుకు చంద్రబాబు ఏం చెప్తారో చూడాలి.

ఇప్పుడు తెలుగుదేశానికి చెందిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారని రాద్ధాంతం చేస్తున్న చంద్రబాబు.. నాడు అధికారంలో ఉన్నప్పుడు తమను అరెస్టు చేయడమే కాదు… కనీసం కాలకృత్యాలు తీర్చుకోనీయకుండా నిఘా నడుమ 14 రోజులపాటు నిర్బంధించారని…. తన భార్య, కోడలుపై దాడి జరిగినప్పుడు స్పందించని చంద్రబాబు.. ఇప్పుడు అమరావతిలో మహిళలపై స్పందించడం హాస్యాస్పదమంటూ.. బాబు నోరు మూసేశారు ముద్రగడ.

ఇవి మాత్రమే కాదు.. వెన్నుపోటు రాజకీయాలు, చందాలు, జోలె రాజకీయాల వంటివాటినీ ముద్రగడ ప్రస్తావించారు. నాడు తాము విరాళాలు లేకుండా.. సొంత డబ్బులతో పోరాటం చేశామని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు జోలె పట్టి డబ్బులు వసూలు చేస్తున్న చంద్రబాబును ఏమనాలని ప్రశ్నిస్తున్నారు. నాడు తెలుగుదేశం కార్యకలాపాల కోసం మీడియాను సమస్తం గుప్పెట్లో పెట్టుకున్నారని ముద్రగడ ఆరోపించారు. ఇప్పుడు కూడా అనుకూల మీడియాలో అమరావతి గురించి చెప్పిందే చెప్పి.. రాసిందే రాయించి మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మొత్తంగా.. ఇన్నాళ్లూ గొంతు చించుకుంటూ ఊరూ వాడా తిరిగేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు.. తనను రాజకీయంగా బజారున నిలబెట్టేలా ముద్రగడ వేసిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇస్తారన్నది ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.

First Published:  13 Jan 2020 9:05 PM GMT
Next Story