Telugu Global
NEWS

తెలుగు తమ్ముళ్ళను... ఆ సెంటిమెంటే భయపెడుతోందట !

అమరావతి విషయం రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాదు… కొన్ని జాతీయ పేపర్లు, టీవీల ద్వారా దేశ వ్యాప్తంగా ప్రచారం జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు చంద్రబాబు. ఈ సందర్భంగా.. ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడం కోసం చంద్రబాబు స్వయంగా ఐక్య కార్యాచరణ సమితిని ఏర్పాటు చేశారు. ఫలితంగా.. చాలా జిల్లాల్లో ఐకాసలు ఏర్పడి.. బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వారికి ఆర్థిక ఆసరా కల్పించే దిశగా.. చంద్రబాబు కూడా జోలె పట్టి భిక్షాటన చేసి మరీ.. ఐకాస కోసం డబ్బులు […]

తెలుగు తమ్ముళ్ళను... ఆ సెంటిమెంటే భయపెడుతోందట !
X

అమరావతి విషయం రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాదు… కొన్ని జాతీయ పేపర్లు, టీవీల ద్వారా దేశ వ్యాప్తంగా ప్రచారం జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు చంద్రబాబు.

ఈ సందర్భంగా.. ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడం కోసం చంద్రబాబు స్వయంగా ఐక్య కార్యాచరణ సమితిని ఏర్పాటు చేశారు. ఫలితంగా.. చాలా జిల్లాల్లో ఐకాసలు ఏర్పడి.. బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వారికి ఆర్థిక ఆసరా కల్పించే దిశగా.. చంద్రబాబు కూడా జోలె పట్టి భిక్షాటన చేసి మరీ.. ఐకాస కోసం డబ్బులు పోగేస్తున్నారు. డబ్బులు ఇచ్చిన వారి పేర్లను బహిరంగ సమావేశాల్లో చంద్రబాబే స్వయంగా చదువుతూ.. వారిని ఉత్సాహ పరుస్తూ.. మరింత మంది విరాళాలు ఇచ్చేలా ప్రోత్సహిస్తున్నారు.

అంతా బాగానే ఉంది. ఇక్కడ చంద్రబాబు వ్యవహార శైలిపైనే.. ఆయన ప్రత్యర్థులు, న్యూట్రల్ గా ఉండే రాజకీయ వాదులు కొన్ని ఆసక్తికర విషయాలు ప్రస్తావిస్తున్నారు. ఈ వాదనకు.. గతంలో జరిగిన విషయాలనూ జోడిస్తూ తమ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నారు.

అందులో ముఖ్యమైన విషయం.. ఎన్నికల నాటి ప్రచార సరళి. 2014లో పూర్తి స్థాయి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ.. 2019లోనూ అధికారం నిలబెట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ కు అధికారం దక్కకుండా ఉండేందుకు అనేక ప్రణాళికలు అమలు చేసింది.

ఇందులో భాగంగా.. నాటి ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రకరకాల నినాదాలు చేశారు. మోదీకి, కేసీఆర్ కు జగన్ అనుకూలంగా నడుచుకుంటున్నారని విమర్శలు చేయడమే కాకుండా.. ప్రతి బహిరంగసభ చివరిలో తన మార్క్ చాటేలా.. ”ఆత్మగౌరవాన్ని.. కాపాడుకుందాం” అంటూ నినాదాలు చేశారు. ‘డన్ సింబల్’ చూపిస్తూ జనాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. తర్వాత ఎన్నికలు పూర్తయ్యాయి. ఫలితాలు ఎలా వచ్చాయో అందరికీ తెలుసు.

ఇప్పుడు అమరావతి వంతు వచ్చింది. ప్రతి సభలోనూ చంద్రబాబు ఇలాగే ప్రవర్తిస్తున్నారు. జగన్ ను చాలా విషయాల్లో విమర్శిస్తున్నారు. పైగా.. సభలు, సమావేశాలు పూర్తయ్యే సందర్భం వచ్చేసరికి.. నినాదాలు చేస్తూ.. రకరకాల హావభావాలు ప్రదర్శిస్తున్నారు. ఇదే.. తెలుగుదేశం నాయకులను ఆందోళనకు గురి చేస్తోంది. అంతిమ ఫలితం ఎలా ఉంటుందో?.. ఎలాంటి పరిణామాలను తెలుగు దేశం ఎదుర్కోవాల్సి వస్తుందో? అని ఆందోళన చెందుతున్నారట. చూద్దాం మరి.. ఈ వ్యవహార శైలి ఎలాంటి ఫలితాలను ఇస్తుందో.

First Published:  13 Jan 2020 10:15 PM GMT
Next Story