Telugu Global
NEWS

హత్యకు ముందే డీల్‌ మాట్లాడుకున్న డీఎస్పీ

గుంటూరు నార్త్ జోన్ డీఎస్పీగా పనిచేసిన గోగినేని రామాంజనేయులును డీజీపీ గౌతమ్ సవాంగ్ సస్పెండ్ చేశారు. ఒక మహిళ హత్య కేసులో లంచం తీసుకుని తప్పుదారి పట్టించిన వ్యవహారంలో డీఎస్పీపై వేటు పడింది. ఒక మహిళ హత్యకు సంబంధించిన టీడీపీ నేతతో ముందే 10లక్షలకు డీల్‌ మాట్లాడుకుని కేసును తప్పుదోవ పట్టించారు డీఎస్పీ రామాంజనేయులు. అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు చేయించి డీఎస్పీపై వేటు వేశారు. తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు. మంగళగిరి […]

హత్యకు ముందే డీల్‌ మాట్లాడుకున్న డీఎస్పీ
X

గుంటూరు నార్త్ జోన్ డీఎస్పీగా పనిచేసిన గోగినేని రామాంజనేయులును డీజీపీ గౌతమ్ సవాంగ్ సస్పెండ్ చేశారు. ఒక మహిళ హత్య కేసులో లంచం తీసుకుని తప్పుదారి పట్టించిన వ్యవహారంలో డీఎస్పీపై వేటు పడింది. ఒక మహిళ హత్యకు సంబంధించిన టీడీపీ నేతతో ముందే 10లక్షలకు డీల్‌ మాట్లాడుకుని కేసును తప్పుదోవ పట్టించారు డీఎస్పీ రామాంజనేయులు. అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు చేయించి డీఎస్పీపై వేటు వేశారు. తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు.

మంగళగిరి మండలం యర్రపాలెం గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కోటేశ్వరరావు… ఒక మహిళతో సహజీవనం చేసేవాడు. కొన్నాళ్ల తర్వాత ఆమెను వదిలించుకునేందుకు హత్య ప్లాన్ చేశాడు. ఇందుకు మంగళగిరి టీడీపీ అధ్యక్షుడి సాయం తీసుకున్నాడు. సదరు టీడీపీ నాయకుడు నాటి డీఎస్పీ రామాంజనేయులుతో ముందే 10లక్షలకు డీల్ మాట్లాడారు. మహిళను హత్య చేసిన తర్వాత కేసు రాకుండా చూసుకునేందుకు ఈ డీల్.

అనుకున్నట్టుగానే రియల్ ఎస్టేట్ వ్యాపారి… సదరు మహిళను హత్య చేసి శవం కూడా కనిపించకుండా చేశాడు. ఆమె బంధువులు ఫిర్యాదు చేయగా… మిస్సింగ్ కేసుగా దాన్ని నమోదు చేసి దర్యాప్తు ముందుకెళ్లకుండా డీఎస్పీ రామాంజనేయులు చేశాడు. 2017లో ఈ హత్య జరిగింది. అయితే ఇటీవల ఆకాశరామన్న ఉత్తరం ద్వారా పోలీసు ఉన్నతాధికారులకు ఈ వ్యవహారం మొత్తం చేరింది.

డీఎస్పీ రామాంజనేయులును కొన్ని నెలల క్రితం డీజీపీ కార్యాలయానికి పిలిపించి ప్రాథమికంగా విచారించారు. అయితే తనకేమీ సంబంధ లేదని చెప్పడంతో శాఖాపరమైన విచారణకు డీజీపీ ఆదేశించారు. విచారణలో నిందితుడి నుంచి రూ.10 లక్షలు లంచం తీసుకొని హత్యను… మిస్సింగ్‌ కేసుగానే వదిలేసినట్లు తేలింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ప్రస్తుతం తన కార్యాలయంలోనే వెయిటింగ్‌లో ఉన్న డీఎస్పీ రామాంజనేయులుని సస్పెండ్‌ చేశారు.

సస్పెండ్ అయిన గోగినేని రామాంజనేయులు… మాజీ మంత్రి నారా లోకేష్‌కు సన్నిహితుడు. గుంటూరు అర్బన్‌ డీఎస్పీగా ఉన్న సమయంలో అనేక అక్రమాలకు పాల్పడి కోట్లాది రూపాయలు ఈయన సంపాదించినట్టు ఆరోపణలు ఉన్నాయి. కాని లోకేష్ అండ ఉండడంతో గతంలో ఆయన్ను ఎవరూ ఏమీ చేయలేకపోయారు. మహిళ హత్య కేసులో రామాంజనేయులు ప్రమేయాన్ని సీరియస్‌గా తీసుకున్న డీజీపీ మరింత లోతుగా దర్యాప్తు చేయిస్తున్నారు.

First Published:  10 Jan 2020 11:41 PM GMT
Next Story