Telugu Global
International

2020 మొదటి చంద్ర గ్రహణం.... పేరు కూడా పెట్టేశారు...

ఈ కొత్త సంవత్సరం లోనే కాదు… ఈ కొత్త దశాబ్దం లోనే మొదటగా దర్శనం ఇచ్చే చంద్ర గ్రహణం గురించి నాసా శాస్త్రవేత్తలు సమాచారం విడుదల చేశారు. 2020 మొదటి చంద్ర గ్రహణం జనవరి 10న ఏర్పడనుంది. ఈ ఖగోళ సంఘటన ను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ‘వూల్ఫ్ మూన్ ఎక్లిప్స్’ అని పేరు పెట్టింది. ఇది ఈసారి భారతదేశంలో కనిపిస్తుంది. వాస్తవానికి, ఆసియా, ఆఫ్రికా, యూరప్‌లోని దేశాలు కూడా చంద్ర గ్రహణాన్ని చూడగలుగుతాయి. […]

2020 మొదటి చంద్ర గ్రహణం.... పేరు కూడా పెట్టేశారు...
X

ఈ కొత్త సంవత్సరం లోనే కాదు… ఈ కొత్త దశాబ్దం లోనే మొదటగా దర్శనం ఇచ్చే చంద్ర గ్రహణం గురించి నాసా శాస్త్రవేత్తలు సమాచారం విడుదల చేశారు.

2020 మొదటి చంద్ర గ్రహణం జనవరి 10న ఏర్పడనుంది. ఈ ఖగోళ సంఘటన ను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ‘వూల్ఫ్ మూన్ ఎక్లిప్స్’ అని పేరు పెట్టింది. ఇది ఈసారి భారతదేశంలో కనిపిస్తుంది. వాస్తవానికి, ఆసియా, ఆఫ్రికా, యూరప్‌లోని దేశాలు కూడా చంద్ర గ్రహణాన్ని చూడగలుగుతాయి.

మొత్తం గ్రహణం వ్యవధి 4 గంటల 5 నిమిషాలుగా చెబుతున్నారు. ఈ సంవత్సరం సంభవించబోయే నాలుగు చంద్ర గ్రహణాలలో ఇది మొదటిది.

జనవరి 10, శుక్రవారం నాడు చంద్ర గ్రహణం భారతదేశంలో రాత్రి 10:37 నుండి జనవరి 11 ఉదయం 2:42 వరకు ఉంటుంది.

ఈ చంద్ర గ్రహణం అమెరికాలో కనిపించదు. భూమి మీద ఈ ప్రాంతంలో ఆ సమయం పగలుగా ఉంటుంది.

సూర్యగ్రహణాలను చూసేటప్పుడు, ప్రత్యేక అద్దాలను సాధారణంగా నిపుణులు సిఫార్సు చేస్తారు. కానీ చంద్ర గ్రహణం విషయంలో అటువంటివి ఏమీ ఉండవు. వాటి అవసరం లేదు. మామూలు కంటితో చూడటం సురక్షితమే.

ఈ యేడాది జూన్ 5, జూలై 5, నవంబర్ 30 తేదీలలో మిగిలిన మూడు చంద్ర గ్రహణాలు ఏర్పడతాయి.

First Published:  7 Jan 2020 6:30 PM GMT
Next Story