Telugu Global
NEWS

నారాయణ.. నారాయణ.. మీ తీరు మారదా?

సీపీఐ, సీపీఎం నాయకులు.. అమరావతి విషయంలో అనుసరిస్తున్న వైఖరి.. అయోమయంగా కొనసాగుతోంది. ఇందుకు.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. ఆవేశపూరితంగా చేసిన వ్యాఖ్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అమరావతి పరిధిలో జరుగుతున్న ఆందోళనలకు సంఘీభావం తెలియజేస్తున్న ఆయన.. ఇటీవల అయోమయ పూరితంగా మాట్లాడారు. అమరావతికే తమ మద్దతు.. అని నారాయణ అన్నంత వరకూ బాగానే ఉంది. అమరావతినే సంపూర్ణ రాజధానిగా కొనసాగిస్తామని ప్రభుత్వం చెప్పేవరకూ ఆందోళన ఆపేది లేదన్నది కూడా బాగానే ఉంది. కానీ.. ఓ వైపు అమరావతికే […]

నారాయణ.. నారాయణ.. మీ తీరు మారదా?
X

సీపీఐ, సీపీఎం నాయకులు.. అమరావతి విషయంలో అనుసరిస్తున్న వైఖరి.. అయోమయంగా కొనసాగుతోంది. ఇందుకు.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. ఆవేశపూరితంగా చేసిన వ్యాఖ్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అమరావతి పరిధిలో జరుగుతున్న ఆందోళనలకు సంఘీభావం తెలియజేస్తున్న ఆయన.. ఇటీవల అయోమయ పూరితంగా మాట్లాడారు.

అమరావతికే తమ మద్దతు.. అని నారాయణ అన్నంత వరకూ బాగానే ఉంది. అమరావతినే సంపూర్ణ రాజధానిగా కొనసాగిస్తామని ప్రభుత్వం చెప్పేవరకూ ఆందోళన ఆపేది లేదన్నది కూడా బాగానే ఉంది. కానీ.. ఓ వైపు అమరావతికే మద్దతు పలుకుతూ.. మరోవైపు కేబినెట్ ను రద్దు చేసి ఎన్నికలకు వెళ్తే.. 3 రాజధానులకు మద్దతిస్తాం అంటూ.. ఆయన వ్యాఖ్యానించడమే.. సీపీఐ శ్రేణులనూ అయోమయానికి గురి చేసింది.

ప్రజల్లో ఇప్పటికే ఉనికి పోయిన సందర్భంలో.. రాష్ట్ర పార్టీకి సరైన దశాదిశా అందించే నాయకులను తయారుచేసుకోలేక పోతున్న తరుణంలో.. నారాయణ ఇలా చేస్తున్నారేంటి.. అని సీపీఐ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి. కుదిరితే ప్రజల ఆకాంక్షలు గుర్తించాలి.. లేదంటే వారికి సంఘీభావం తెలిపి ఒకే స్టాండ్ పై ఉండాలి. ప్రజల ఆందోళనల్లో తప్పు ఉంటే.. ఆ విషయాలపై అవగాహన కలిగించే ప్రయత్నం చేయాలి.

నిజంగా.. పార్టీకి ఉనికి తీసుకురావాలన్న ఆలోచనే ఉంటే.. సీపీఐ నాయకులు ముందుగా ప్రజా ఉద్యమాలు నిర్మించాలి. నిపుణులతో మంచీ చెడూ విచారణ చేయించి.. అమరావతి రైతులకు వివరించాలి. కొందరి మాటలు నమ్మి రోడ్డు పాలైన ఆ రైతుల జీవితాలు బాగుపరిచేలా చర్యలు తీసుకోవాలి. తన పార్టీ కేడర్ ను ఈ దిశగా సమర్థంగా కదిలించగలగాలి. ఇవేవీ లేకుండా.. ధర్నాల శిబిరాల దగ్గర కూర్చుంటా.. ఇలాగే మాట్లాడతా.. అంటే అది నిరర్థక ప్రయత్నంగానే మిగిలిపోతుంది. ఈ తీరు మారితేనే.. సీపీఐకి భవష్యత్తు ఉంటుంది.

First Published:  7 Jan 2020 11:55 PM GMT
Next Story