Telugu Global
NEWS

రాళ్లు వేయించడం కాదు... మగాళ్లైతే నువ్వు లేదా నీకొడుకు లోకేష్‌ రండి... తేల్చుకుందాం...

తనపై దాడి చేసినంత మాత్రాన భయపడే ప్రసక్తే లేదన్నారు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. చినకాకాని వద్ద టీడీపీ కార్యకర్తలు తన కారుపై రాళ్ల దాడి చేయడంపై స్పందించిన పిన్నెల్లి… వ్యక్తిగతంగా తనపై దాడి చేయాలనుకుంటే టైం చెప్పాలని తానే వస్తానన్నారు. చంద్రబాబు వస్తారో, ఆయన కుమారుడు వస్తాడో, టీడీపీ నేతలెవరొస్తారో తేల్చుకునేందుకు తాను సిద్ధమన్నారు. విజయవాడ వెళ్తున్న సమయంలో ప్రధాన రహదారిపై టీడీపీ వారు ధర్నా చేస్తుంటే తాను పక్కనే ఉన్న సర్వీసు రోడ్డు మీద […]

రాళ్లు వేయించడం కాదు... మగాళ్లైతే నువ్వు లేదా నీకొడుకు లోకేష్‌ రండి... తేల్చుకుందాం...
X

తనపై దాడి చేసినంత మాత్రాన భయపడే ప్రసక్తే లేదన్నారు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. చినకాకాని వద్ద టీడీపీ కార్యకర్తలు తన కారుపై రాళ్ల దాడి చేయడంపై స్పందించిన పిన్నెల్లి… వ్యక్తిగతంగా తనపై దాడి చేయాలనుకుంటే టైం చెప్పాలని తానే వస్తానన్నారు. చంద్రబాబు వస్తారో, ఆయన కుమారుడు వస్తాడో, టీడీపీ నేతలెవరొస్తారో తేల్చుకునేందుకు తాను సిద్ధమన్నారు.

విజయవాడ వెళ్తున్న సమయంలో ప్రధాన రహదారిపై టీడీపీ వారు ధర్నా చేస్తుంటే తాను పక్కనే ఉన్న సర్వీసు రోడ్డు మీద వెళ్తున్న సమయంలో 40 మంది దాడి చేశారన్నారు. తన కారు మీద దాడి చేసినంత మాత్రాన నిర్ణయాలు మారిపోతాయా అని ప్రశ్నించారు. అన్ని వర్గాలు, ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని జగన్ నిర్ణయాలు తీసుకుంటారన్నారు.

రాజధానిలో చంద్రబాబు, ఆయన బినామీలు భూములు కొని వాటికోసం ఇలా దాడులు చేయిస్తే సాధించేది ఏమీ ఉండదన్నారు. గతంలో జగన్‌మోహన్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసిన సమయంలో కూడా తాము శాంతియుతంగానే వ్యవహరించామన్నారు. కానీ ఇప్పుడు మాత్రం శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు చంద్రబాబు ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.

చంద్రబాబు దద్దమ్మలా ముసుగేసుకుని ఇలాంటి రాజకీయం చేయడం మానేసి… దమ్ముంటే నేరుగా వస్తే తేల్చుకునేందుకు సిద్ధమన్నారు. అంతేగానీ రైతుల ముసుగులో టీడీపీ కార్యకర్తలతో దాడులు చేయిస్తే భయపడే ప్రసక్తే లేదన్నారు. దద్దమ్మలా మరొకరిని ముందుపెట్టడం మానేసి మగాడైతే చంద్రబాబే స్వయంగా రోడ్డు మీదకు రావాలని… చంద్రబాబుకు చేతగాకుంటే ఆయన కొడుకును పంపించాలని సవాల్ చేశారు.

తమను భయపెట్టడం చంద్రబాబుకే కాదు… వాడిని పుట్టించినోడి వల్ల కూడా సాధ్యం కాదన్నారు. సమస్య ఏదైనా ఉంటే సీఎంతో మాట్లాడుకోవాలి గానీ… ఇలా దాడి చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. చంద్రబాబు మగాడైతే టైం చెప్పిమరీ రావాలని సవాల్ చేశారు. చంద్రబాబు ఆయన కొడుకు మగాళ్లు అయితే నేరుగా వస్తే తేల్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

First Published:  7 Jan 2020 3:43 AM GMT
Next Story