Telugu Global
NEWS

కేటీఆర్ ను సీఎం చేసేందుకు కేసీఆర్ ను చంపేస్తారేమో " రేవంత్ 

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలతో దుమారం రేపారు. ప్రతీసారి కేసీఆర్ అంటేనే ఉవ్వెత్తున లేచే రేవంత్ తాజాగా కేటీఆర్ మీద పడ్డారు. కేటీఆర్ సీఎం అంటూ జరుగుతున్న ప్రచారం చూసి కొంప దీసి కేసీఆర్ ను చంపేస్తారేమో.. కేటీఆర్ తో కేసీఆర్ ప్రాణాలకు ముప్పు ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వెంటనే కేటీఆర్ ను ప్రగతి భవన్ నుంచి ఖాళీ చేయించాలని రేవంత్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని గడ్డి అన్నారం […]

కేటీఆర్ ను సీఎం చేసేందుకు కేసీఆర్ ను చంపేస్తారేమో  రేవంత్ 
X

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలతో దుమారం రేపారు. ప్రతీసారి కేసీఆర్ అంటేనే ఉవ్వెత్తున లేచే రేవంత్ తాజాగా కేటీఆర్ మీద పడ్డారు. కేటీఆర్ సీఎం అంటూ జరుగుతున్న ప్రచారం చూసి కొంప దీసి కేసీఆర్ ను చంపేస్తారేమో.. కేటీఆర్ తో కేసీఆర్ ప్రాణాలకు ముప్పు ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వెంటనే కేటీఆర్ ను ప్రగతి భవన్ నుంచి ఖాళీ చేయించాలని రేవంత్ డిమాండ్ చేశారు.

హైదరాబాద్ లోని గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కేటీఆర్ సీఎం అంటూ ప్రకటనలు చూస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణాలకు ముప్పు ఉన్నట్లు అనుమానం కలుగుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తనను ముఖ్యమంత్రిని చేయకపోతే కేటీఆర్ అర్ధరాత్రి లేచి దిండుతో కేసీఆర్ ను ఒత్తుతాడేమో అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ కు ఏదైనా జరగరానిది జరిగితే దానికి కేటీఆర్ దే బాధ్యత అంటూ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పదవి కోసం కేసీఆర్ పై కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తున్నారని… వాళ్ల కుటుంబంలో చిచ్చు రేగుతోందని రేవంత్ ఆరోపించారు.

First Published:  5 Jan 2020 1:20 AM GMT
Next Story