Telugu Global
NEWS

భారత కుర్రాడు ప్రపంచ నంబర్ వన్

అండర్-21 టాప్ ర్యాంక్ లో మానవ్ టక్కర్ భారత కుర్రాడు మానవ్ టక్కర్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. ప్రపంచ టేబుల్ టెన్నిస్ 21సంవత్సరాల విభాగంలో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ లో నిలిచాడు. కెనడా వేదికగా ముగిసిన ప్రపంచ టీటీ అండర్ -21 ఫైనల్స్ లో 19 సంవత్సరాల మానవ్ విజేతగా నిలిచాడు. టైటిల్ సమరంలో అర్జెంటీనా ఆటగాడు మార్టిన్ బెంటాన్ కోర్ ను 11-3, 11-5, 11-6తో చిత్తు చేశాడు. ప్రపంచ టైటిల్ సాధించడం […]

భారత కుర్రాడు ప్రపంచ నంబర్ వన్
X
  • అండర్-21 టాప్ ర్యాంక్ లో మానవ్ టక్కర్

భారత కుర్రాడు మానవ్ టక్కర్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. ప్రపంచ టేబుల్ టెన్నిస్ 21సంవత్సరాల విభాగంలో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ లో నిలిచాడు.

కెనడా వేదికగా ముగిసిన ప్రపంచ టీటీ అండర్ -21 ఫైనల్స్ లో 19 సంవత్సరాల మానవ్ విజేతగా నిలిచాడు. టైటిల్ సమరంలో అర్జెంటీనా ఆటగాడు మార్టిన్ బెంటాన్ కోర్ ను 11-3, 11-5, 11-6తో చిత్తు చేశాడు. ప్రపంచ టైటిల్ సాధించడం ద్వారా నంబర్ వన్ ర్యాంక్ కు చేరుకోగలిగాడు.

నాలుగో భారత ఆటగాడు మానవ్

ప్రపంచ టేబుల్ టెన్నిస్ అండర్ -21 విభాగంలో నంబర్ వన్ ర్యాంక్ సాధించిన నాలుగో భారతకుర్రాడిగా మానవ్ టక్కర్ రికార్డుల్లో చేరాడు.

మానవ్ కంటే ముందే ఈ ఘనత సాధించిన క్రీడాకారుల్లో హర్మీత్ దేశాయ్, సత్యన్, సౌమ్యజీత్ ఘోష్ ఉన్నారు.

2018లో నే అండర్ -18 విభాగంలో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ గా నిలిచిన మానవ్ ఇప్పుడు అండర్ -21 విభాగంలో సైతం అదే ఘనత సాధించడం విశేషం.

జకార్తాలో ముగిసిన 2018 ఆసియాక్రీడల టీటీ పురుషుల విభాగంలో కాంస్య పతకం సాధించిన భారతజట్టులో మానవ్ సభ్యుడిగా ఉన్నాడు.

30వ ర్యాంక్ లో సత్యన్..

ప్రపంచ టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం భారత సంచలనం సత్యన్ 30వ ర్యాంక్ లో నిలిచాడు. ఓ భారత ఆటగాడు సాధించిన అత్యుత్తమ సీనియర్ ర్యాంకు ఇదే కావడం విశేషం.

తెలుగుతేజం ఆచంట శరత్ కమల్ 33వ ర్యాంక్ కు చేరుకోగలిగాడు. మహిళల సింగిల్స్ లోమనకీ బాత్రా 61వ ర్యాంక్ లో కొనసాగుతోంది.

First Published:  3 Jan 2020 10:40 PM GMT
Next Story