Telugu Global
NEWS

అండర్ -19 ప్రపంచకప్ కు భారత్ గురి

నాలుగుసార్లు విశ్వవిజేతగా భారత్ ఐదోసారి ప్రపంచ టైటిల్ వైపు భారత్ చూపు జూనియర్ ( అండర్ -19 ) ప్రపంచకప్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుపొందిన భారత్…ఐదోసారి విశ్వవిజేతగా నిలవాలన్న పట్టుదలతో ఉంది. సౌతాఫ్రికా వేదికగా జనవరి 17 నుంచి ఫిబ్రవరి 9 వరకూ జరిగే 2020 ప్రపంచకప్ టోర్నీ బరిలోకి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో టైటిల్ వేటకు దిగుతోంది. రెండుదశాబ్దాలలో నాలుగు టైటిల్స్… మహ్మద్ కైఫ్ నాయకత్వంలో 2000 సంవత్సరంలో ముగిసిన ప్రపంచకప్ ను […]

అండర్ -19 ప్రపంచకప్ కు భారత్ గురి
X
  • నాలుగుసార్లు విశ్వవిజేతగా భారత్
  • ఐదోసారి ప్రపంచ టైటిల్ వైపు భారత్ చూపు

జూనియర్ ( అండర్ -19 ) ప్రపంచకప్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుపొందిన భారత్…ఐదోసారి విశ్వవిజేతగా నిలవాలన్న పట్టుదలతో ఉంది.

సౌతాఫ్రికా వేదికగా జనవరి 17 నుంచి ఫిబ్రవరి 9 వరకూ జరిగే 2020 ప్రపంచకప్ టోర్నీ బరిలోకి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో టైటిల్ వేటకు దిగుతోంది.

రెండుదశాబ్దాలలో నాలుగు టైటిల్స్…

మహ్మద్ కైఫ్ నాయకత్వంలో 2000 సంవత్సరంలో ముగిసిన ప్రపంచకప్ ను తొలిసారిగా గెలుచుకొన్న భారత్ …ఆ తర్వాత మరో మూడు టైటిల్స్ సాధించింది.

ఆ తర్వాత ఎనిమిదేళ్లకు మలేసియా వేదికగా ముగిసిన 2008 ప్రపంచకప్ లో విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టు రెండోసారి ప్రపంచ టైటిల్ అందుకొంది. విరాట్ కొహ్లీ మొత్తం 235 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

2012లో ఆస్ట్ర్రేలియా వేదికగా ముగిసిన ప్రపంచకప్ ను సైతం భారతజట్టు నిలుకొంది. ఉన్ముక్త్ చంద్ నాయకత్వంలోని భారతజట్టు మూడోసారి విశ్వవిజేత కాగలిగింది.

2018లో న్యూజిలాండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్ లో బంగ్లాదేశ్ ను, సెమీఫైనల్లో పాకిస్తాన్ ను చిత్తు చేసిన భారత్… టైటిల్ సమరంలో ఆస్ట్ర్రేలియాను అధిగమించింది.

పృథ్వీ షా నాయకత్వంలోని భారతజట్టు అత్యుత్తమ జట్టుగా నాలుగోసారి ప్రపంచ ట్రోఫీ అందుకొంది. మొత్తం ఆరుమ్యాచ్ ల్లో పృథ్వీ షా 261 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

సౌతాఫ్రికా వేదికగా 13వ ప్రపంచకప్…

2020 జూనియర్ ప్రపంచకప్ టోర్నీకి సౌతాఫ్రికా ఆతిథ్యమిస్తోంది. ప్రపంచకప్ కు వేదికగా నిలవడం సౌతాఫ్రికాకు ఇది రెండోసారి. జనవరి 17 నుంచి ఫిబ్రవరి 9 వరకూ రెండువారాలపాటు సాగే ఈటోర్నీలో 16 దేశాలజట్లు ఢీ కొనబోతున్నాయి.
గ్రూపు- ఏ లీగ్ లో జపాన్, న్యూజిలాండ్, శ్రీలంక జట్లతో భారత్ తలపడాల్సి ఉంది. జనవరి 27నుంచి నాకౌట్ రౌండ్ పోటీలు ప్రారంభంకానున్నాయి.

జూనియర్ స్థాయి నుంచే హేమాహేమీలు…

జూనియర్ ప్రపంచకప్ వేదికగా యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా, అంబటి రాయుడు, కేన్ విలియమ్స్ సన్, వెయిన్ పార్నెల్, ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, స్టీవ్ స్మిత్, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, జో రూట్ లాంటి స్టార్ ప్లేయర్లు ప్రపంచక్రికెట్లోకి దూసుకువచ్చినవారే.

2020 ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టుకు ప్రియం గార్గ్ నాయకత్వం వహించనున్నాడు. జట్టులోని ఇతర ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, దివ్యాంశు సక్సేనా,ధృవ్ చంద్ జూరెల్, షషావత్ రావత్, దివ్యాంశ్ జోషీ, శుభాంగ్ హెగ్డే, రవి బిష్నోయ్, ఆకాశ్ సింగ్, కార్తీక్ త్యాగీ, అధర్వ్ అన్ కోల్కర్, కుమార్ కుషాగ్రా, కుమార్ మిశ్రా, విద్యాధర్ పాటిల్ ఉన్నారు.

డిఫెండింగ్ చాంపియన్ భారత్ కు ఆస్ట్ర్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్ల నుంచి ప్రధానంగా పోటీ ఎదురుకానుంది.

First Published:  3 Jan 2020 10:46 PM GMT
Next Story