Telugu Global
NEWS

శ్రీలంకతో సిరీస్ కు బుమ్రా రెడీ

గాయంతో గత నాలుగుమాసాలుగా దూరం భారతయువఫాస్ట్ బౌలర్, యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా గాయం నుంచి పూర్తిగా కోలుకోడం ద్వారా…పూర్తి ఫిట్ నెస్ తో రీ-ఎంట్రీకి సిద్ధమయ్యాడు. ప్రపంచకప్ కు సన్నాహకంగా శ్రీలంకతో ఆదివారం ప్రారంభమయ్యే తీన్మార్ టీ-20 సిరీస్ తొలిమ్యాచ్ ద్వారా పునరాగమనానికి ఎదురుచూస్తున్నాడు. గత ఏడాది సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ నుంచి గాయంతో జట్టుకు దూరమైన బుమ్రా తన చివరి మ్యాచ్ లో వెస్టిండీస్ పై 7 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు […]

శ్రీలంకతో సిరీస్ కు బుమ్రా రెడీ
X
  • గాయంతో గత నాలుగుమాసాలుగా దూరం

భారతయువఫాస్ట్ బౌలర్, యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా గాయం నుంచి పూర్తిగా కోలుకోడం ద్వారా…పూర్తి ఫిట్ నెస్ తో రీ-ఎంట్రీకి సిద్ధమయ్యాడు.

ప్రపంచకప్ కు సన్నాహకంగా శ్రీలంకతో ఆదివారం ప్రారంభమయ్యే తీన్మార్ టీ-20 సిరీస్ తొలిమ్యాచ్ ద్వారా పునరాగమనానికి ఎదురుచూస్తున్నాడు.

గత ఏడాది సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ నుంచి గాయంతో జట్టుకు దూరమైన బుమ్రా తన చివరి మ్యాచ్ లో వెస్టిండీస్ పై 7 వికెట్లు పడగొట్టాడు.

అంతేకాదు టెస్టు క్రికెట్లో హ్యాట్రిక్ సాధించిన భారత మూడో బౌలర్ గా నిలిచాడు. గతంలోనే టెస్టు హ్యాట్రిక్ లు సాధించిన హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ ల సరసన బుమ్రా నిలిచాడు.

2019 సీజన్లో బుమ్రా క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ అత్యుత్తమంగా రాణించగలిగాడు. ఆస్ట్ర్రేలియాను ఆస్ట్ర్రేలియా గడ్డపై చిత్తు చేసి భారతజట్టు తొలిసారిగా టెస్ట్ సిరీస్ నెగ్గడంలో బుమ్రా కీలకపాత్ర పోషించాడు.

వన్డే క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్, టెస్ట్ క్రికెట్లో ఆరో నంబర్ ర్యాంక్ బౌలర్ గా నిలిచాడు. గత సీజన్లో ఆడిన12 టెస్టుల్లో 62 వికెట్లు, 58 వన్డేల్లో 103 వికెట్లు, 42 టీ-20 మ్యాచ్ ల్లో 51 వికెట్లు సాధించాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలవడంలో బుమ్రా తనవంతు పాత్ర నిర్వర్తించాడు.

శ్రీలంకతో సిరీస్ ద్వారా 2020 సీజన్ ను మొదలుపెడుతున్న బుమ్రా…ఆస్ట్ర్రేలియా వేదికగా జరిగే టీ-20 ప్రపంచకప్ లో భారత తురుపుముక్కకానున్నాడు.

గౌహతీలో ఆదివారం శ్రీలంకతో జరుగనున్న తొలి టీ-20లో బుమ్రా తనదైన శైలిలో రాణిస్తాడా… వేచిచూడాల్సిందే.

First Published:  3 Jan 2020 10:36 PM GMT
Next Story