Telugu Global
Cinema & Entertainment

డబ్బింగ్ పూర్తిచేసిన నాగశౌర్య

తన సినిమాకు సంబంధించి ఒక్కొక్కటిగా ప్రతి పనిని పూర్తిచేస్తున్నాడు నాగశౌర్య. సొంత సినిమా కావడం, స్వయంగా తనే కథ రాసుకోవడంతో.. అశ్వథ్థామపై చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగా సినిమాకు సంబంధించి డబ్బింగ్ పూర్తిచేశాడు. మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో రమణ తేజ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాతో ఆశించిన స్థాయిలో ప్రమోషన్ అందుకోలేకపోతున్నాడు శౌర్య… దీనికి కారణం సంక్రాంతి సినిమాలే. సంక్రాంతి బరిలో ఉన్న మహేష్, […]

డబ్బింగ్ పూర్తిచేసిన నాగశౌర్య
X

తన సినిమాకు సంబంధించి ఒక్కొక్కటిగా ప్రతి పనిని పూర్తిచేస్తున్నాడు నాగశౌర్య. సొంత సినిమా కావడం, స్వయంగా తనే కథ రాసుకోవడంతో.. అశ్వథ్థామపై చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగా సినిమాకు సంబంధించి డబ్బింగ్ పూర్తిచేశాడు. మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో రమణ తేజ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాతో ఆశించిన స్థాయిలో ప్రమోషన్ అందుకోలేకపోతున్నాడు శౌర్య… దీనికి కారణం సంక్రాంతి సినిమాలే. సంక్రాంతి బరిలో ఉన్న మహేష్, బన్నీ సినిమాలపై ప్రేక్షకుల దృష్టంతా ఉంది. ఆ హీరోల ప్రమోషన్ కూడా అదే రేంజ్ లో ఉంది. దీంతో సంక్రాంతి తర్వాత విడుదల కావాల్సిన అశ్వథ్థామ సినిమా గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.

ఉన్నంతలో టీజర్ తో అందర్నీ ఆకర్షించిన నాగశౌర్య, కొన్నాళ్ల పాటు తన మూవీ ప్రమోషన్ ను పక్కనపెట్టాలని నిర్ణయించాడు. ఈలోగా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసి, ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకునే పనిలో పడ్డాడు. సంక్రాంతి సినిమాలు థియేటర్లలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఫ్రెష్ గా మరోసారి అశ్వథ్థామను తెరపైకి తీసుకురావాలని చూస్తున్నాడు.

First Published:  4 Jan 2020 8:10 AM GMT
Next Story