Telugu Global
NEWS

బాక్సింగ్ లో అజేయం- రాజకీయంగా పరాజయం

విజేందర్ కు మిశ్రమ అనుభవాలు భారత బాక్సింగ్ దిగ్గజం, మొట్టమొదటి ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ గత ఐదేళ్ల కాలంలో ఓటమి ఎరుగని బాక్సర్ గా నిలిచాడు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ కు ఎన్నో అరుదైన విజయాలు అందించిన విజేందర్ సింగ్ బాక్సర్ గా విజయాలు సాధించిన ..పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ తరపున న్యూఢిల్లీ సౌత్ స్థానం నుంచి పోటీకి దిగి పరాజయం చవిచూడక తప్పలేదు. జీవితంలో కొన్నిసార్లు విజేతగా నిలుస్తాం, మరికొన్ని సార్లు పరాజయాలు చవిచూస్తాం. […]

బాక్సింగ్ లో అజేయం- రాజకీయంగా పరాజయం
X
  • విజేందర్ కు మిశ్రమ అనుభవాలు

భారత బాక్సింగ్ దిగ్గజం, మొట్టమొదటి ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ గత ఐదేళ్ల కాలంలో ఓటమి ఎరుగని బాక్సర్ గా నిలిచాడు.

అంతర్జాతీయ స్థాయిలో భారత్ కు ఎన్నో అరుదైన విజయాలు అందించిన విజేందర్ సింగ్ బాక్సర్ గా విజయాలు సాధించిన ..పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ తరపున న్యూఢిల్లీ సౌత్
స్థానం నుంచి పోటీకి దిగి పరాజయం చవిచూడక తప్పలేదు.

జీవితంలో కొన్నిసార్లు విజేతగా నిలుస్తాం, మరికొన్ని సార్లు పరాజయాలు చవిచూస్తాం. ఇదో చక్కటి పాఠం అంటూ తాత్విక ధోరణితో మాట్లాడే విజేందర్.. ఐదేళ్ల ప్రో-సర్క్యూట్ ప్రస్థానం అజేయంగా ముగిసింది.

ప్రో- బాక్సర్ గా 12-0 రికార్డు

2008 బీజింగ్ ఒలింపిక్స్ బాక్సింగ్ లో, 2009 ప్రపంచ బాక్సింగ్ లో భారత్ కు పతకాలు అందించిన తొలి బాక్సర్ ఘనతను సొంతం చేసుకొన్న 34 ఏళ్ల విజేందర్ సింగ్ 2015లో ప్రొఫెషనల్ బాక్సర్ గా మారాడు.

అమెరికాలోని విఖ్యాత బాక్సింగ్ ప్రమోటర్ బాబ్ ఆరుమ్ పర్యవేక్షణలో శిక్షణ పొందుతూ…గత ఐదేళ్ల కాలంలో తలపడిన 12కు 12 ప్రోఫైట్లలో విజేందర్ అజేయంగా నిలిచాడు.

కొత్త దశాబ్దం తొలి సంవత్సరంలో నాలుగు పైట్లతో పాటు…ప్రపంచ టైటిల్ సాధించాలన్నది తన లక్ష్యమని విజేందర్ ప్రకటించాడు.

2019 నవంబర్ లో ఘనా బాక్సర్ చార్లెస్ ఆడం పై అలవోక విజయం సాధించడం ద్వారా గత ఏడాదిని విజేందర్ అజేయంగా ముగించగలిగాడు.

ప్రముఖ ట్రెయినర్ లీ బియర్డ్ శిక్షణలో సాధన చేస్తున్న విజేందర్ గురుగ్రామ్ లోని జిమ్ లో ప్రాక్టీస్ అనంతరం బర్మింగ్ హామ్ బయలుదేరనున్నాడు.

ఇప్పటికే ప్రపంచ బాక్సింగ్ ఆసియా-పసిఫిక్, ఓరియంటల్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్స్ సాధించిన విజేందర్…ప్రపంచ టైటిల్ సాధించడమే లక్ష్యమని ప్రకటించాడు.

పశ్చాతాపం లేదు…విజేందర్

బాక్సర్ గా ఉంటూనే రాజకీయాల రొంపిలోకి దిగడం పట్ల తాను ఏమాత్రం పశ్చాతాపం పొందడంలేదని… పోటీ చేసిన ప్రతిసారీ నెగ్గాలన్న రూలేమీలేదని…లోక్ సభ
ఎన్నికల ఓటమి తనకో చక్కటి పాఠమని చెప్పాడు.

ఓటమి ఎదురైనంత మాత్రాన తాను పారిపోయేవాడిని కాదని, తనకు రాజకీయాలు, ప్రజల సమస్యలపట్ల సంపూర్ణ అవగాహన ఉందని, హైకమాండ్ ఆదేశిస్తే ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమని ప్రకటించాడు. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారానికి తాను ఎప్పుడూ
అందుబాటులో ఉంటానని తేల్చి చెప్పాడు.

First Published:  2 Jan 2020 9:10 PM GMT
Next Story