Telugu Global
Cinema & Entertainment

సంక్రాంతి సినిమాల నిడివి ఫిక్స్

సరిలేరు నీకెవ్వరు – 2 గంటల 48 నిమిషాలు అల వైకుంఠపురములో – 2 గంటల 36 నిమిషాలు ఎంత మంచివాడవురా – 2 గంటల 22 నిమిషాలు సంక్రాంతి సినిమాల రన్ టైమ్స్ ఇవి. ఇంకా సెన్సార్ పూర్తికాని ఈ సినిమాలకు సంబంధించి ప్రస్తుతానికి ఈ నిడివి ఫిక్స్ చేశారు. వీటిలో ఏ సినిమా పరిస్థితి ఏంటనేది ఓసారి చేద్దాం… సరిలేరు నీకెవ్వరు నిడివి ఇప్పటికే లిమిట్ దాటిపోయింది. ఆల్రెడీ షకలక శంకర్ కామెడీ ట్రాక్ […]

సంక్రాంతి సినిమాల నిడివి ఫిక్స్
X
  • సరిలేరు నీకెవ్వరు – 2 గంటల 48 నిమిషాలు
  • అల వైకుంఠపురములో – 2 గంటల 36 నిమిషాలు
  • ఎంత మంచివాడవురా – 2 గంటల 22 నిమిషాలు

సంక్రాంతి సినిమాల రన్ టైమ్స్ ఇవి. ఇంకా సెన్సార్ పూర్తికాని ఈ సినిమాలకు సంబంధించి ప్రస్తుతానికి ఈ నిడివి ఫిక్స్ చేశారు. వీటిలో ఏ సినిమా పరిస్థితి ఏంటనేది ఓసారి చేద్దాం…

సరిలేరు నీకెవ్వరు నిడివి ఇప్పటికే లిమిట్ దాటిపోయింది. ఆల్రెడీ షకలక శంకర్ కామెడీ ట్రాక్ మొత్తం తీసేశారు. అయినప్పటికి రన్ టైమ్ 2 గంటల 48 నిమిషాలకు వచ్చేసింది. దీంతో మహేష్ నిర్ణయం కోసం అంతా వెయిటింగ్. ఈరోజు రాత్రికి మహేష్ ఈ సినిమా మొత్తం చూడబోతున్నాడు. అతడు చెబితే కొన్ని కట్స్ పడతాయి. లేదంటే, ఇదే రన్ టైమ్ తో 2 రోజుల్లో సెన్సార్ కు వెళ్తారు.

ఇక అల వైకుంఠపురములో సినిమా విషయానికొస్తే..ఇది 2 గంటల 36 నిమిషాల రన్ టైమ్ తో వస్తోంది. ఇది రెగ్యులర్ నిడివే. కాబట్టి సమస్య లేదు. కాకపోతే అల్లు అర్జున్, అల్లు అరవింద్ ఇంకా సినిమా చూడలేదు. వాళ్లిద్దరి ఇన్ పుట్స్ తీసుకున్న తర్వాత అసలైన రన్ టైమ్ లాక్ అవుతుంది. బన్నీ బ్యాంకాంక్ నుంచి ఈరోజు వస్తున్నాడు. బహుశా రేపు సినిమా చూసే ఛాన్స్ ఉంది.

ఇక ఎంత మంచివాడవురా సినిమాకు సంబంధించి ఎలాంటి అనుమానాలు లేవు. ఎందుకంటే ఈ సినిమా ఎడిటింగ్ లో ఫస్ట్ నుంచి కల్యాణ్ రామ్ కూర్చుంటున్నాడు. అలా దర్శకుడు సతీష్ వేగేశ్న, కల్యాణ్ రామ్ కలిసి ఈ సినిమాను ఓ కొలిక్కి తీసుకొచ్చారు. పైగా రన్ టైమ్ కూడా తక్కువగానే ఉండడంతో.. దాదాపు ఇదే రన్ టైమ్ లో సెన్సార్ కు వెళ్లబోతున్నారు.

Next Story