Telugu Global
NEWS

సెర్బియా గాళ్ ఫ్రెండ్ తో హార్దిక్ పాండ్యా నిశ్చితార్థం

నటాసా స్టాన్ కోవిక్ తో త్వరలో వివాహం భారత వివాదాస్పద ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇప్పటి వరకూ సిరీస్ కు ఓ క్రికెట్ బ్యాట్ ను మార్చినట్లుగా సీజన్ కో గాళ్ ఫ్రెండ్ ను మార్చుతూ వచ్చిన హార్థిక్…సెర్బియన్ నటి నటాసా స్టాన్ కోవిక్ ను తన జీవితభాగస్వామిని చేసుకోవాలని నిర్ణయించాడు. నటాసాతో తనకు నిశ్చితార్థం జరిగినట్లు సోషల్ మీడియా ద్వారా బయటపెట్టాడు. వెన్నెముక గాయంతో గత నాలుగుమాసాలుగా క్రికెట్ కు దూరంగా […]

సెర్బియా గాళ్ ఫ్రెండ్ తో హార్దిక్ పాండ్యా నిశ్చితార్థం
X
  • నటాసా స్టాన్ కోవిక్ తో త్వరలో వివాహం

భారత వివాదాస్పద ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇప్పటి వరకూ సిరీస్ కు ఓ క్రికెట్ బ్యాట్ ను మార్చినట్లుగా సీజన్ కో గాళ్ ఫ్రెండ్ ను మార్చుతూ వచ్చిన హార్థిక్…సెర్బియన్ నటి నటాసా స్టాన్ కోవిక్ ను తన జీవితభాగస్వామిని చేసుకోవాలని నిర్ణయించాడు. నటాసాతో తనకు నిశ్చితార్థం జరిగినట్లు సోషల్ మీడియా ద్వారా బయటపెట్టాడు.

వెన్నెముక గాయంతో గత నాలుగుమాసాలుగా క్రికెట్ కు దూరంగా ఉన్న హార్థిక్ పాండ్యా..పూర్తి ఫిట్ నెస్ తర్వాత తిరిగి భారతజట్టులో చేరాలని భావిస్తున్నాడు. న్యూజిలాండ్ పర్యటనకు భారత -ఏ జట్టు తరపున పాల్గోనున్నాడు.

నువ్వు నాదానివి…నేను నీవాడను…మన ఇద్దరి సంగతీ భారత దేశానికి తెలుసు అంటూ…పాండ్యా కొత్తసంవత్సరం తొలిరోజునే తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు. నటాసాతో తన ఎంగేజ్ మెంట్ గురించి తొలిసారిగా బయటపెట్టాడు.

హార్థిక్ పాండ్యా ఎంగేజ్ మెంట్ గురించి తెలుసుకొన్న భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ…కొత్తజంటకు శుభాకాంక్షలు తెలిపాడు. దేవుడు చల్లగా చూడాలంటూ తన సందేశాన్ని పంపాడు.

గతంలో జరిగిన కాఫీ విత్ కరణ్ షోలో మహిళలు, యువతుల పట్ల సహఆటగాడు రాహుల్ తో కలసి అనుచిత వ్యాఖ్యలు చేసిన హార్థిక్ పాండ్యా అప్పట్లో సస్పెన్షన్ కు గురైన సంగతి తెలిసిందే. అమ్మాయిలతో గడపడం అంటే తనకు చచ్చేంత ఇష్టమని.. తాను ఎంతమందితో గడిపింది బయటపెట్టి వివాదంలో చిక్కుకొన్నాడు.

మొత్తం మీద అమ్మాయిల వేటకు స్వస్తి చెప్పిన హార్థిక్ పాండ్యా …నటాసాతో కలసి జీవించాలని అభిమానులు కోరుకొంటున్నారు.

First Published:  1 Jan 2020 10:34 PM GMT
Next Story