Telugu Global
NEWS

బాలీవుడ్ హీరోలను మించిన విరాట్ కొహ్లీ

ఫోర్బెస్ ఇండియా 100 సెలబ్రిటీలలో కొహ్లీ టాప్ భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ క్రికెట్ ఫీల్డ్ లో మాత్రమే కాదు…సంపాదనలోనూ భారత నంబర్ వన్ గా నిలిచాడు. ఇప్పటి వరకూ భారత గడ్డపై నిలిచిన అత్యంత ధనవంతులైన సెలబ్రిటీల జాబితాలో బాలీవుడ్ హీరోల ఆధిపత్యానికి తొలిసారిగా గండి కొట్టాడు. 2019 సంవత్సరానికి ఫోర్బెస్ ప్రకటించిన ఇండియా- 100 సెలబ్రిటీలలో కొహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. గత ఎనిమిదేళ్లలో ఈ ఘనత సాధించిన తొలి క్రీడాకారుడిగా రికార్డుల్లో చేరాడు. 2018 అక్టోబర్ […]

బాలీవుడ్ హీరోలను మించిన విరాట్ కొహ్లీ
X
  • ఫోర్బెస్ ఇండియా 100 సెలబ్రిటీలలో కొహ్లీ టాప్

భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ క్రికెట్ ఫీల్డ్ లో మాత్రమే కాదు…సంపాదనలోనూ భారత నంబర్ వన్ గా నిలిచాడు. ఇప్పటి వరకూ భారత గడ్డపై నిలిచిన అత్యంత ధనవంతులైన సెలబ్రిటీల జాబితాలో బాలీవుడ్ హీరోల ఆధిపత్యానికి తొలిసారిగా గండి కొట్టాడు.

2019 సంవత్సరానికి ఫోర్బెస్ ప్రకటించిన ఇండియా- 100 సెలబ్రిటీలలో కొహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. గత ఎనిమిదేళ్లలో ఈ ఘనత సాధించిన తొలి క్రీడాకారుడిగా రికార్డుల్లో చేరాడు.

2018 అక్టోబర్ 1 నుంచి 2019 సెప్టెంబర్ 30 మధ్యకాలంలో కొహ్లీ మొత్తం 252 కోట్ల 72 లక్షల రూపాయలు ఆర్జించడం ద్వారా అత్యధిక ఆర్జన కలిగిన భారత సెలెబ్రిటీగా నిలిచాడు. బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్ , సల్మాన్ ఖాన్ రెండు, మూడు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

వివిధ రూపాలలో ఆర్జన..

విరాట్ కొహ్లీ మ్యాచ్ ఫీజులు, బీసీసీఐతో వార్షిక కాంట్రాక్టు, ఐపీఎల్ కాంట్రాక్టు, బ్రాండ్ ఎండార్స్ మెంట్లు, ఇన్ స్టాగ్రామ్ ఫోస్టుల ద్వారా వచ్చే మొత్తాలతో కలుపుకొని గత ఏడాది కాలంలో 252 కోట్ల రూపాయలకు పైగా సంపాదించగలిగాడు.

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, మాస్టర్ సచిన్ టెండుల్కర్ టాప్-10 సెలబ్రిటీలలో చోటు సంపాదించగలిగారు. ధోనీ 5వ ర్యాంక్ లో నిలిస్తే ..సచిన్ 9వ ర్యాంక్ సాధించగలిగాడు.

దటీజ్ సచిన్….

మాస్టర్ సచిన్ టెండుల్కర్ 2013లో క్రికెట్ నుంచి పూర్తిగా రిటైరైనా సంపాదనలో మాత్రం తన ప్రత్యేకతను కాపాడుకొంటూ వస్తున్నాడు. ఫోర్బెస్ భారత ఆర్జనపరుల జాబితా మొదటి 10 స్థానాలలో చోటు దక్కించుకొంటూనే వస్తున్నాడు.

భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తన సంపాదనను గణనీయంగా పెంచుకోడం ద్వారా 23వ ర్యాంక్ నుంచి 11వ ర్యాంక్ కు చేరుకోగలిగాడు. ఫోర్బెస్ టాప్ -100 లో చోటు సంపాదించిన భారత ఇతర క్రికెటర్లలో రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, జస్ ప్రీత్ బుమ్రా, కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ సైతం ఉన్నారు.

మిథాలీ, హర్మన్ ప్రీత్ సైతం…

భారత మహిళా స్టార్ క్రికెటర్లు మిథాలీరాజ్, హర్మన్ ప్రీత్ కౌర్ తమ సంపాదనను గణనీయంగా పెంచుకోడం ద్వారా టాప్-100లో నిలువగలిగారు.

మొదటి 100లో నిలిచిన ఇతర భారత ప్లేయర్లలో సైనా నెహ్వాల్, పీవీ సింధు, వస్తాదు బజరంగ్ పూనియా, బాక్సర్ మేరీ కోమ్, టెన్నిస్ ప్లేయర్ రోహన్ బొపన్న, ఫుట్ బాలర్ సునీల్ చెత్రీ, గోల్ఫర్ అనీర్బన్ లాహిరీ సైతం ఉన్నారు.

మొత్తం మీద పరుగులు, రికార్డులు, విజయాలు సాధించడంలోనే కాదు..సంపాదనలోనూ తననుమించిన మొనగాడు భారత గడ్డపైన మరొకరు లేరని పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ చాటుకోడం విశేషం.

First Published:  30 Dec 2019 9:12 PM GMT
Next Story