Telugu Global
NEWS

ప్రపంచ ర్యాపిడ్ చెస్ విజేత కోనేరు హంపి

2001 తర్వాత తెలుగు తేజం అతిపెద్ద విజయం గ్రాండ్ మాస్టర్ హంపికి ఏపీ సీఎం జగన్ అభినందన తెలుగుతేజం, భారత మహిళా గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి 18 సంవత్సరాల తర్వాత తన కెరియర్ లో అతిపెద్ద విజయం సాధించింది. మాస్కో వేదికగా ముగిసిన 2019 మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్ నెగ్గి ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళా గ్రాండ్ మాస్టర్ గా రికార్డుల్లో చేరింది. విశ్వవిజేతగా నిలిచిన తెలుగుతేజం హంపిని ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి […]

ప్రపంచ ర్యాపిడ్ చెస్ విజేత కోనేరు హంపి
X
  • 2001 తర్వాత తెలుగు తేజం అతిపెద్ద విజయం
  • గ్రాండ్ మాస్టర్ హంపికి ఏపీ సీఎం జగన్ అభినందన

తెలుగుతేజం, భారత మహిళా గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి 18 సంవత్సరాల తర్వాత తన కెరియర్ లో అతిపెద్ద విజయం సాధించింది.

మాస్కో వేదికగా ముగిసిన 2019 మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్ నెగ్గి ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళా గ్రాండ్ మాస్టర్ గా రికార్డుల్లో చేరింది.

విశ్వవిజేతగా నిలిచిన తెలుగుతేజం హంపిని ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి అభినందించారు. ఆంధ్రప్రదేశ్ కే గర్వకారణమంటూ ప్రశంసించారు.

12 రౌండ్ల ఈ టోర్నీలో పాల్గొన్న 32 సంవత్సరాల హంపి…ఓ బిడ్డకు తల్లిగా ప్రపంచ టైటిల్ సాధించడం ఇదే మొదటిసారి.

2001లో ప్రపంచ జూనియర్ బాలికల టైటిల్ నెగ్గిన కోనేరు హంపి ఆ తర్వాత మరో ప్రపంచ టైటిల్ కోసం2019 వరకూ వేచి చూడాల్సివచ్చింది.

ఆఖరి, 12వ రౌండ్లో చైనా గ్రాండ్ మాస్టర్ లీ టింగ్ జీని అధిగమించిన హంపి మరో ఇద్దరు గ్రాండ్ మాస్టర్లతో కలసి సమఉజ్జీగా నిలిచింది. ముగ్గురికి పాయింట్లు సమంగా రావడంతో సగటు ఎత్తుల ప్రాతిపదికన హంపిని విజేతగా ప్రకటించారు.

ప్రస్తుత సీజన్లో ఫిడే గ్రాండ్ ప్రీ సిరీస్ లు నెగ్గడంతో పాటు ప్రస్తుత ప్రపంచ టైటిల్ తో హంపి 30 ఎలో రేటింగ్ పాయింట్లు సాధించడం ద్వారా తన ర్యాంక్ ను మూడోస్థానానికి మెరుగు పరచుకోగలిగింది.

పురుషుల విభాగంలో మాగ్నుస్ కార్ల్ సన్ 12 రౌండ్లలో 11.5 పాయింట్లు, మహిళల విభాగంలో కోనేరు హంపి 12 రౌండ్లలో 9 పాయింట్లు సాధించడం ద్వారా ప్రపంచ ర్యాపిడ్ విజేతలుగా నిలువగలిగారు.

తన కుటుంబసభ్యుల సహకారంతోనే తాను ఓ బిడ్డకు తల్లిగా ప్రపంచ టైటిల్ నెగ్గగలిగానని, ఇదో మధురానుభవమని కోనేరు హంపి ప్రకటించింది.

First Published:  29 Dec 2019 9:48 PM GMT
Next Story