Telugu Global
NEWS

3 రాజధానులపై సీఎం రమేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

సీఎం రమేశ్.. మొన్నటి వరకూ చంద్రబాబుకు రైట్ హ్యాండ్. టీడీపీకి ఆర్థిక అండదండలు ఇచ్చారనే పేరుంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో భారీగా లబ్ది పొందిన ఈయన… చంద్రబాబు ప్రోద్బలంతోనే బీజేపీలో చేరి సెటిల్ అయ్యారని అంటుంటారు. అయితే చంద్రబాబు అమరావతి రాజధాని మార్పుపై ఆందోళన చేస్తున్నారు. ఓవైపు చంద్రబాబు… మరో రైట్ హ్యాండ్ అయిన సుజనా చౌదరి అమరావతిని మార్చవద్దంటూ మీడియా ముందు గగ్గోలు పెడుతున్నారు. ప్రధాని మోడీకి చెప్పి రాజధాని మార్పు జరగనీయనని సుజనా చౌదరి […]

3 రాజధానులపై సీఎం రమేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

సీఎం రమేశ్.. మొన్నటి వరకూ చంద్రబాబుకు రైట్ హ్యాండ్. టీడీపీకి ఆర్థిక అండదండలు ఇచ్చారనే పేరుంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో భారీగా లబ్ది పొందిన ఈయన… చంద్రబాబు ప్రోద్బలంతోనే బీజేపీలో చేరి సెటిల్ అయ్యారని అంటుంటారు.

అయితే చంద్రబాబు అమరావతి రాజధాని మార్పుపై ఆందోళన చేస్తున్నారు. ఓవైపు చంద్రబాబు… మరో రైట్ హ్యాండ్ అయిన సుజనా చౌదరి అమరావతిని మార్చవద్దంటూ మీడియా ముందు గగ్గోలు పెడుతున్నారు. ప్రధాని మోడీకి చెప్పి రాజధాని మార్పు జరగనీయనని సుజనా చౌదరి శపథం కూడా చేశారు.

చంద్రబాబుకు అత్యంత ఆప్తుడైన సీఎం రమేష్ ఇన్నాళ్లు రాజధాని మార్పుపై స్పందించలేదు. తాజాగా ఈ ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సీఎం రమేష్… ఏపీ సీఎం జగన్ తీసుకొస్తున్న 3 రాజధానులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సీఎం రమేష్ తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ… ‘రాజధాని మార్పుపై ఇంకా అధిష్టానంతో సంప్రదించలేదని.. కేంద్రంలోని పెద్దలు కూడా దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని’ సంచలన కామెంట్ చేశారు.

ప్రస్తుతానికి రాజధానిని తరలించకూడదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేస్తున్న నిరసనలకు తాము కూడా అధ్యక్షుడి నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని సీఎం రమేష్ తెలిపారు.

దీన్ని బట్టి జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయంపై కేంద్రంలోని పెద్దలు ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

First Published:  30 Dec 2019 2:18 AM GMT
Next Story