Telugu Global
NEWS

భూమా వర్సెస్‌ గంగుల... ఛైర్మన్‌ గిరి కోసం ఫైట్‌

మిల్క్ డెయిరీ ఛైర్మన్ పదవి కోసం కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ కు చెందిన భూమా, గంగుల కుటుంబాల మధ్య ఫైట్‌ మొదలైంది. గత 26 సంవత్సరాల కాలంగా స్వర్గీయ భూమా నాగిరెడ్డి చిన్నాన్న భూమా నారాయణ రెడ్డి ఛైర్మన్ గా కొనసాగుతున్నారు. అయితే ఈ సారి భూమా కుటుంబానికి ఆ పదవి రాకుండా గంగుల కుటుంబం పావులు కదుపుతోంది. ఈ నెల చివరికి ఛైర్మన్ పదవి కాలం ముగియనుంది. వచ్చే ఎన్నికలలో గంగుల కుటుంబం ఛైర్మన్ పదవి […]

భూమా వర్సెస్‌ గంగుల... ఛైర్మన్‌ గిరి కోసం ఫైట్‌
X

మిల్క్ డెయిరీ ఛైర్మన్ పదవి కోసం కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ కు చెందిన భూమా, గంగుల కుటుంబాల మధ్య ఫైట్‌ మొదలైంది. గత 26 సంవత్సరాల కాలంగా స్వర్గీయ భూమా నాగిరెడ్డి చిన్నాన్న భూమా నారాయణ రెడ్డి ఛైర్మన్ గా కొనసాగుతున్నారు. అయితే ఈ సారి భూమా కుటుంబానికి ఆ పదవి రాకుండా గంగుల కుటుంబం పావులు కదుపుతోంది.

ఈ నెల చివరికి ఛైర్మన్ పదవి కాలం ముగియనుంది. వచ్చే ఎన్నికలలో గంగుల కుటుంబం ఛైర్మన్ పదవి దక్కించుకోడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. భూమా కుటుంబం నుంచి మాజీ మంత్రి అఖిల ప్రియ తన సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిని ఛైర్మన్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆళ్ళగడ్డ ‌ఎమ్మెల్యే గంగుల నాని తన కుటుంబానికి చెందిన గంగుల విజయసింహా రెడ్డిని ఛైర్మన్‌ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

కర్నూలు జిల్లా నంద్యాల విజయ డెయిరీ కింద 123 పాల ఉత్పత్తి సహకార సంఘాలు ఉన్నాయి. సుమారు 543 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. డెయిరీ లాభాల బాటలో నడుస్తోంది. 26 సంవత్సరాలుగా ఛైర్మన్‌ ఎన్నిక ఏకగ్రీవంగా జరుగుతోంది. సోమవారం జరిగే మీటింగ్‌ లో జగత్‌ విఖ్యాత్‌రెడ్డిని కో ఆప్షన్‌ మెంబర్‌గా ఎన్నిక బోతున్నారు. అయితే డెయిరీలో అవకతవకలు జరుగున్నాయని గంగుల వర్గం డైరెక్టర్‌ సుబ్బరాయుడు మీడియా ముందుకు వచ్చారు.

తనకు ఆరుగురు డైరెక్టర్ల మద్దతు ఉందని… ఛైర్మన్‌తో పాటు మేనేజింగ్‌ డైరెక్టర్‌ను మార్చాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. ఇటు ఛైర్మన్‌ గిరి కోసం భూమా వర్గం విశ్వప్రయత్నాలు చేస్తుంటే… గంగుల కుటుంబానికి చెందిన గంగుల సుభాష్‌ రెడ్డి కుమారుడు గంగుల విజయ సింహా‌రెడ్డిని చైర్మన్ చేసేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోంది.

First Published:  30 Dec 2019 4:26 AM GMT
Next Story