Telugu Global
NEWS

మంచుకొండల్లో విరాట్ కొహ్లీ ఆటవిడుపు

భార్య అనుష్కతో హాయి హాయిగా…. భారత కెప్టెన్, ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ఆటగాడు విరాట్ కొహ్లీ తనకు లభించిన విరామాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొంటున్నాడు. ఏడాది పొడుగునా.. సిరీస్ వెంట సిరీస్ ఆడుతూ బిజీబిజీగా ఉండే కొహ్లీ మాత్రం తన భార్య అనుష్క కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నాడు. ఇటీవలే తన వివాహదినోత్సం రెండో ఏడాదిని భూటాన్ లో గడిపి వచ్చిన విరాట్ కొహ్లీ- అనుష్క శర్మ జోడీ..2019 సంవత్సరాంతంలో లభించిన విరామసమయాన్ని మంచుకొండల్లో విహారానికి కేటాయించారు. విరుష్క […]

మంచుకొండల్లో విరాట్ కొహ్లీ ఆటవిడుపు
X
  • భార్య అనుష్కతో హాయి హాయిగా….

భారత కెప్టెన్, ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ఆటగాడు విరాట్ కొహ్లీ తనకు లభించిన విరామాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొంటున్నాడు. ఏడాది పొడుగునా.. సిరీస్ వెంట సిరీస్ ఆడుతూ బిజీబిజీగా ఉండే కొహ్లీ మాత్రం తన భార్య అనుష్క కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నాడు.

ఇటీవలే తన వివాహదినోత్సం రెండో ఏడాదిని భూటాన్ లో గడిపి వచ్చిన విరాట్ కొహ్లీ- అనుష్క శర్మ జోడీ..2019 సంవత్సరాంతంలో లభించిన విరామసమయాన్ని మంచుకొండల్లో విహారానికి కేటాయించారు.

విరుష్క జోడీ ప్రత్యేక హెలీకాప్టర్ లో మంచుకొండలపైన చక్కర్లు కొట్టడంతో పాటు…విహరించిన దృశ్యాలను తమ ఇన్ స్టా గ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకొన్నారు.

ఈ దశాబ్దపు అత్యుత్తమ విజ్ డెన్ క్రికెటర్ గౌరవం పొందిన విరాట్ కొహ్లీ..2020 సీజన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు.
శ్రీలంకతో జనవరి 5న ప్రారంభమయ్యే తీన్మార్ టీ-20 సిరీస్ ద్వారా…ఆస్ట్ర్రేలియా వేదికగా జరిగే టీ-20 ప్రపంచకప్ కు సన్నాహాలు మొదలు పెట్టనున్నాడు.

ఆ తర్వాత ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా జరిగే మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ లో సైతం కొహ్లీ భారతజట్టుకు నాయకత్వం వహించనున్నాడు.

జనవరి 24 నుంచి న్యూజిలాండ్ గడ్డ పైన జరిగే ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో కివీ జట్టుతో కొహ్లీ నాయకత్వంలోని భారత జట్టు తలపడాల్సి ఉంది.

మార్చి 4 వరకూ జరిగే న్యూజిలాండ్ టూర్ లో భాగంగా వన్డే సిరీస్ తో పాటు రెండుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో సైతం విరాట్ సేన పోటీపడనుంది.

తన వ్యక్తిగత ఫోటోలను ట్విట్టర్, ఇన్‌ స్టా గ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకోడం ద్వారా విరాట్ కొహ్లీ లక్షల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నాడు. కొహ్లీకి లక్షలాదిమంది ఫాలోయర్స్ ఉన్నారు.

First Published:  28 Dec 2019 8:55 PM GMT
Next Story