Telugu Global
Cinema & Entertainment

వన్ అండ్ ఓన్లీ హీరో ప్రభాస్ మాత్రమే

పారితోషికం పరంగా చూసుకుంటే ఇప్పుడు అందరికంటే ఎత్తులో ఉన్నాడు ప్రభాస్. ఇతడి రెమ్యూనరేషన్ ను టచ్ చేయడం ఇప్పట్లో మరో తెలుగు హీరో వల్ల కాకపోవచ్చు. ఆ మాటకొస్తే, సౌత్ లోనే ఏ హీరో ప్రభాస్ స్థాయిలో పారితోషికం తీసుకునే రేంజ్ కు వెళ్లలేకపోవచ్చు. అవును.. తన నెక్ట్స్ సినిమాకు ఏకంగా 70 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు యంగ్ రెబల్ స్టార్. అతడి కెరీర్ లోనే కాదు, టోటల్ సౌత్ లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్ ఇది. త్వరలోనే […]

వన్ అండ్ ఓన్లీ హీరో ప్రభాస్ మాత్రమే
X

పారితోషికం పరంగా చూసుకుంటే ఇప్పుడు అందరికంటే ఎత్తులో ఉన్నాడు ప్రభాస్. ఇతడి రెమ్యూనరేషన్ ను టచ్ చేయడం ఇప్పట్లో మరో తెలుగు హీరో వల్ల కాకపోవచ్చు. ఆ మాటకొస్తే, సౌత్ లోనే ఏ హీరో ప్రభాస్ స్థాయిలో పారితోషికం తీసుకునే రేంజ్ కు వెళ్లలేకపోవచ్చు. అవును.. తన నెక్ట్స్ సినిమాకు ఏకంగా 70 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు యంగ్ రెబల్ స్టార్. అతడి కెరీర్ లోనే కాదు, టోటల్ సౌత్ లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్ ఇది.

త్వరలోనే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రాబోతోంది ఈ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్, టి-సిరీస్ కలిసి నిర్మించబోతున్నాయి. ఈ మూవీ కోసం అటు మైత్రీ, ఇటు టీ-సిరీస్ కలిసి ప్రభాస్ కు అక్షరాలా 70 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యథిక పారితోషికం తీసుకుంటున్న హీరో మహేష్. సరిలేరు నీకెవ్వరు సినిమాకు ఇతడికి అటుఇటుగా 40 కోట్ల రూపాయలు గిట్టుబాటు అయ్యాయి. ఇక చిరంజీవి కూడా దాదాపు 50 కోట్ల వరకు తీసుకుంటున్నాడని టాక్. కాకపోతే రామ్ చరణే నిర్మాత కాబట్టి ఆ రెమ్యూనరేషన్ ను లెక్కలోకి తీసుకోలేం. ఇక రీఎంట్రీలో పవన్ కల్యాణ్ కూడా 50 కోట్లు తీసుకుంటున్నాడనే టాక్ ఉంది. ఇలా వీళ్లలో ఎవరి పారితోషికంతో పోల్చిచూసినా ప్రభాస్ తీసుకుంటున్న మొత్తం చాలా ఎక్కువ.

First Published:  29 Dec 2019 7:00 AM GMT
Next Story