Telugu Global
NEWS

బ్రేకింగ్ : రాజధానిపై బుగ్గన సారథ్యంలో హైపవర్ కమిటీ

విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటిస్తారని ఆశించిన అందరికీ షాక్ ఇస్తూ సీఎం జగన్ మొన్నటి కేబినెట్ మీటింగ్ లో హైపర్ కమిటీని తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే.. బీసీజీ నివేదిక వచ్చాక కూలంకషంగా చర్చించి హైపవర్ కమిటీ రాజధానిపై నిగ్గు తేలుస్తుందని జగన్ చెప్పుకొచ్చారు. అన్నట్టే తాజాగా సీఎం జగన్ ఏపీకి 3 రాజధానుల అంశంపై ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ రెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. […]

బ్రేకింగ్ : రాజధానిపై బుగ్గన సారథ్యంలో హైపవర్ కమిటీ
X

విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటిస్తారని ఆశించిన అందరికీ షాక్ ఇస్తూ సీఎం జగన్ మొన్నటి కేబినెట్ మీటింగ్ లో హైపర్ కమిటీని తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే.. బీసీజీ నివేదిక వచ్చాక కూలంకషంగా చర్చించి హైపవర్ కమిటీ రాజధానిపై నిగ్గు తేలుస్తుందని జగన్ చెప్పుకొచ్చారు.

అన్నట్టే తాజాగా సీఎం జగన్ ఏపీకి 3 రాజధానుల అంశంపై ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ రెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

ఈనెల 27న నిర్వహించిన కేబినెట్ సమావేశంలో రాజధానిపై తొందర ఏమీ లేదని సీఎం జగన్ మంత్రులకు చెప్పిన సంగతి తెలిసిందే. జీఎన్ రావు, బోస్టన్ గ్రూపు నివేదికల తర్వాత హైపవర్ కమిటీ ఏర్పాటు చేసి రాజధానిపై తేలుస్తామన్నారు.

తాజాగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హైపవర్ కమిటీకి చైర్మన్ గా నియామకమయ్యారు. ఈ కమిటీలో మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మేకతోటి సుచరిత, కన్నబాబు, కొడాలి నాని, పేర్ని నాని , బొత్స సత్యనారాయణలతో పాటు ఆయా శాఖలకు చెందిన ఐఏఎస్ లను నియమించారు. ఈ కమిటీ మూడు వారాల్లోపు నివేదిక ఇవ్వాలని… ప్రభుత్వం ఆదేశించింది.

హైపవర్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత జనవరి 20 లేదా 21 తర్వాత అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి…. ఆ సమావేశాల్లోనే ప్రభుత్వం అసెంబ్లీలోనే అధికార ప్రకటన చేయడానికి రెడీ అయ్యింది.

First Published:  29 Dec 2019 2:07 AM GMT
Next Story