Telugu Global
NEWS

సుజ‌నా.... లేఖ కూడా రాయలేవా.... అన్నీత‌ప్పులేనా !

అమ‌రావ‌తి రాజ‌ధాని మార్పుపై ఏపీ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకోలేదు. కానీ టీడీపీ నేత‌లు కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ కోరుతున్నారు. ప్ర‌క‌ట‌న‌ల మీద ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ మాజీ నేత‌లు కూడా వారికి వంత పాడుతున్నారు. ప్ర‌ధానికి లేఖ‌లు రాస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి సుజ‌నా చౌద‌రి ఇప్పుడు ప్ర‌ధానికి లేఖ రాశారు. రాజ‌ధాని విష‌యంలో జోక్యం చేసుకోవాల‌ని కోరారు. అయితే ఈ లేఖ‌లో అన్నీ త‌ప్పులే అంటూ సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు సుజ‌నాను నిల‌దీస్తున్నారు. లేఖ‌లో […]

సుజ‌నా.... లేఖ కూడా రాయలేవా.... అన్నీత‌ప్పులేనా !
X

అమ‌రావ‌తి రాజ‌ధాని మార్పుపై ఏపీ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకోలేదు. కానీ టీడీపీ నేత‌లు కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ కోరుతున్నారు. ప్ర‌క‌ట‌న‌ల మీద ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ మాజీ నేత‌లు కూడా వారికి వంత పాడుతున్నారు. ప్ర‌ధానికి లేఖ‌లు రాస్తున్నారు.

కేంద్ర మాజీ మంత్రి సుజ‌నా చౌద‌రి ఇప్పుడు ప్ర‌ధానికి లేఖ రాశారు. రాజ‌ధాని విష‌యంలో జోక్యం చేసుకోవాల‌ని కోరారు. అయితే ఈ లేఖ‌లో అన్నీ త‌ప్పులే అంటూ సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు సుజ‌నాను నిల‌దీస్తున్నారు.

లేఖ‌లో ప్ర‌ధాన‌మైన మొద‌టి త‌ప్పు. అమ‌రావ‌తి రాజ‌ధానికి 2015 అక్టోబ‌ర్ లో శంకుస్థాప‌న చేస్తే…. 2014లో శంకుస్థాప‌న చేశార‌ని మోదీకి గుర్తు చేయ‌డం… ఇంకో విష‌యం అమ‌రావ‌తిలో ఐదేళ్ల నుంచి పాల‌న సాగుతుంద‌ని చెప్పుకోవ‌డం.

2014లో అధికారంలోకి వ‌చ్చిన తర్వాత హైద‌రాబాద్‌లోనే చంద్ర‌బాబు ఉన్నారు. 2015 మే 30 వ‌ర‌కు హైద‌రాబాద్‌లో ఉన్నారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న త‌ర్వాత ఆయ‌న అమ‌రావ‌తి బాట ప‌ట్టారు. మే 30 త‌ర్వాత విజ‌య‌వాడ‌కు వ‌స్తే… మ‌ళ్లీ తిరిగి వెళ్ల‌లేదు.

అమ‌రావ‌తిలో 29 వేల మంది రైతులు ఉన్నార‌ని మ‌రో మాట చెప్పారు. ఇందులో నిజ‌మైన రైతులు ఎంత‌మంది అనేది సుజ‌నా చౌద‌రికి తెలియాలి. అమ‌రావ‌తిలో భూములు కొన్న‌వారిలో చాలా మంది టీడీపీ నేత‌లే ఉన్నారు. వారిలో ముఖ్య‌మైన వారు సుజనా చౌదరి, వేమూరు చౌదరి, ప్రత్తిపాటి చౌదరి, ధూళిపాళ్ళ చౌదరి, పరిటాల చౌదరి లాంటి అనేక చౌదరి లతో పాటు బినామీలు అయిన నారాయణ లాంటి వారు 4000 ఎకరాల పైనే కొన్నారు .

మొత్తానికి సుజ‌నా లేఖ త‌ప్పుల త‌డకగా త‌యారైంది. క‌నీసం అమ‌రావ‌తి రాజ‌ధానికి శంకుస్థాప‌న ఎప్పుడు జ‌రిగిందో తెలియ‌కుండానే రాజధానిని మార్చొద్దు అంటూ లేఖ రాయడం ఏంటంటూ… నెటిజ‌న్లు సుజ‌నాను ప్ర‌శ్నిస్తున్నారు.

First Published:  27 Dec 2019 10:22 PM GMT
Next Story