Telugu Global
NEWS

సానియా రీ-ఎంట్రీకి కౌంట్ డౌన్

2020 నుంచి సానియా రెండో ఇన్నింగ్స్ షురూ మాతృత్వంతో రెండేళ్లుగా టెన్నిస్ కు దూరం భారత టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా…రెండేళ్లవిరామం తర్వాత తిరిగి ప్రొఫెషనల్ టెన్నిస్ రీ-ఎంట్రీకి పూర్తిస్థాయిలో సిద్ధమయ్యింది. గత రెండేళ్లుగా ప్రో-టెన్నిస్ కు దూరంగా ఉన్న సానియా ఏడాది క్రితమే ఓ మగబిడ్డకు జన్మనివ్వడం ద్వారా తల్లిహోదా పొందిన సానియా..నూటికి నూరుశాతం ఫిట్ నెస్ తో కెరియర్ లో రెండో ఇన్నింగ్స్ లో రాణించాలన్న పట్టుదలతో ఉంది. ముందు జాగ్రత్తగా అన్నట్లుగా టెన్నిస్ లో […]

సానియా రీ-ఎంట్రీకి కౌంట్ డౌన్
X
  • 2020 నుంచి సానియా రెండో ఇన్నింగ్స్ షురూ
  • మాతృత్వంతో రెండేళ్లుగా టెన్నిస్ కు దూరం

భారత టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా…రెండేళ్లవిరామం తర్వాత తిరిగి ప్రొఫెషనల్ టెన్నిస్ రీ-ఎంట్రీకి పూర్తిస్థాయిలో సిద్ధమయ్యింది.

గత రెండేళ్లుగా ప్రో-టెన్నిస్ కు దూరంగా ఉన్న సానియా ఏడాది క్రితమే ఓ మగబిడ్డకు జన్మనివ్వడం ద్వారా తల్లిహోదా పొందిన సానియా..నూటికి నూరుశాతం ఫిట్ నెస్ తో కెరియర్ లో రెండో ఇన్నింగ్స్ లో రాణించాలన్న పట్టుదలతో ఉంది. ముందు జాగ్రత్తగా అన్నట్లుగా టెన్నిస్ లో తాను సాధించాల్సింది, సరికొత్తగా నిరూపించుకోవాల్సింది ఏదీ లేదని చెప్పింది.

4 గంటల సాధనతో…

మాతృత్వం కోసం గత రెండేళ్లుగా టెన్నిస్ కు దూరంగా ఉన్న సానియా… పదకొండు మాసాల క్రితమే ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. తన కుమారుడు ఇజాన్ ఆలనాపాలనా చూస్తూనే… పూర్తిస్థాయి ఫిట్ నెస్ కోసం రోజుకు రెండు విడతలుగా నాలుగు గంటలపాటు కఠోర సాధన చేస్తోంది.

ప్రసవం తర్వాత సానియా అనూహ్యంగా బరువు పెరిగింది. దీంతో బరువు తగ్గడం ద్వారా ప్రొఫెషనల్ టెన్నిస్ కు అవసరమైన ఫిట్ నెస్ కోసం జిమ్ లోనే గంటలపాటు గడుపుతోంది.

26 కిలోల బరువు తగ్గిన సానియా..

మూడుపదుల వయసులో తల్లిగా మారిన సానియా..రోజుకు నాలుగు గంటలపాటు జిమ్ లో వర్కవుట్ చేయడం ద్వారా 26 కిలోల మేర బరువు తగ్గింది.

2020 టోక్యో ఒలింపిక్స్ నాటికి ఫిట్ నెస్ సాధించి… భారతజట్టులో చోటు సంపాదించాలన్న పట్టుదలతో ఉంది. ఇప్పటికే భారత ఫెడరేషన్ కప్ జట్టులో నాలుగేళ్ల విరామం తర్వాత చోటు సంపాదించిన సానియా…జనవరిలో జరిగే ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ టోర్నీ ద్వారా గ్రాండ్ రీ-ఎంట్రీ చేయాలని భావిస్తోంది.

దానికి సన్నాహకంగా…హోబర్ట్ ఇంటర్నేషనల్ టోర్నీలో ఉక్రెయిన్ ప్లేయర్ కిచినోక్ తో జంటగా డబుల్స్ బరిలోకి దిగనుంది.

ఒత్తిడి తగ్గించుకొనే వ్యూహం…

తన కెరియర్ లో ఇప్పటికే మూడు మిక్సిడ్ టైటిల్స్ తో సహా మొత్తం ఆరు గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిల్స్ నెగ్గిన సానియా.. మహిళల డబుల్స్ లో నంబర్ వన్ ర్యాంక్ సైతం సాధించింది.

ఆసియా క్రీడలు,శాఫ్ గేమ్స్, జాతీయ క్రీడల టెన్నిస్ సింగిల్స్, మిక్సిడ్ డబుల్స్ విభాగాలలో పతకాలు సాధించింది. అయితే… రీ-ఎంట్రీలో తాను సరికొత్తగా నిరూపించుకోవాల్సి ఏమీలేదని… తనకు లక్ష్యాలు అంటూ ఏవీలేవని.. సంపూర్ణ ఫిట్ నెస్ తో తిరిగి అంతర్జాతీయ టెన్నిస్ ఆడటమే లక్ష్యమని ప్రకటించింది.

టెన్నిస్ ఆడటమన్నా…పోటీపడటమన్నా తనకు చెప్పలేని ఇష్టమని..తన కుమారుడు ఇజాన్ మాలిక్ మీర్జా ప్రేరణతో తిరిగి టెన్నిస్ ఆడాలని నిర్ణయించినట్లు సానియా చెబుతోంది. టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనే భారతజట్టులో చోటు సంపాదించడమే లక్ష్యంగా సానియా కసరత్తులు చేస్తోంది.

భారత మహిళా టెన్నిస్ చరిత్రలోనే అరుదైన విజయాలతో పాటు…వందకోట్ల రూపాయలకు పైగా ఆర్జించిన సానియా… హైదరాబాద్ లో తనపేరుతో ఓ అకాడమీని సైతం నిర్వహిస్తోంది.

First Published:  27 Dec 2019 9:22 PM GMT
Next Story