Telugu Global
Cinema & Entertainment

కంచరపాలెం దర్శకుడి రీమేక్ ప్రయత్నం

బాహుబలి-2 తర్వాత ఆర్కా మీడియా నిర్మాతలు మళ్లీ తెరపైకి రాలేదు. అలాగే కంచరపాలెం లాంటి సినిమా తర్వాత ఆ సినిమా దర్శకుడు వెంకటేష్ మహా కూడా మళ్లీ తెరపైకి రాలేదు. అలా మీడియాకు దూరంగా ఉన్న ఈ ఇద్దరు ఇప్పుడు కలిశారు. గుట్టుచప్పుడు కాకుండా ఓ సినిమా చేశారు. ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ కు చేరుకున్న తర్వాత, అధికారికంగా ప్రకటించారు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే సినిమా తీశాడు వెంకటేష్ మహ. […]

కంచరపాలెం దర్శకుడి రీమేక్ ప్రయత్నం
X

బాహుబలి-2 తర్వాత ఆర్కా మీడియా నిర్మాతలు మళ్లీ తెరపైకి రాలేదు. అలాగే కంచరపాలెం లాంటి సినిమా తర్వాత ఆ సినిమా దర్శకుడు వెంకటేష్ మహా కూడా మళ్లీ తెరపైకి రాలేదు. అలా మీడియాకు దూరంగా ఉన్న ఈ ఇద్దరు ఇప్పుడు కలిశారు. గుట్టుచప్పుడు కాకుండా ఓ సినిమా చేశారు. ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ కు చేరుకున్న తర్వాత, అధికారికంగా ప్రకటించారు.

ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే సినిమా తీశాడు వెంకటేష్ మహ. బాహుబలి-2 నిర్మించిన శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సినిమాకు నిర్మాతలు. ఇది స్ట్రయిట్ మూవీ కాదు. మలయాళంలో హిట్ అయిన మహేశింతే ప్రతీకారమ్ అనే సినిమాకు రీమేక్. మలయాళంలో ఫాహద్ పాజిల్ హీరోగా నటిస్తే, తెలుగు వెర్షన్ లో సత్యదేవ్ హీరో.

జస్ట్ 36 రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తిచేశారు. షూటింగ్ మొత్తం అరుకు లోయల్లోనే తీశారు. తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి టైటిల్ ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 17న సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. షూటింగ్ కూడా అయి, పోస్ట్ ప్రొడక్షన్ లోకి వచ్చిన సినిమాను ఏప్రిల్ వరకు ఎందుకు రిలీజ్ చేయకుండా ఆపుతున్నారనేది మరో డౌట్.

First Published:  26 Dec 2019 9:08 PM GMT
Next Story