Telugu Global
Cinema & Entertainment

చిరంజీవి రెడీ.. కొరటాలదే ఆలస్యం

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి చేయాల్సిన సినిమా ప్రారంభమై చాన్నాళ్లయింది. సైరా విడుదలైన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకొస్తుందని అంతా అనుకున్నారు. కానీ సైరా రిలీజ్ అవ్వడం, వెళ్లిపోవడం అన్నీ జరిగిపోయాయి కానీ ఇది మాత్రం ఇంకా మొదలవ్వలేదు. ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది. జనవరి 2 నుంచి చిరంజీవి-కొరటాల సెట్స్ పైకి వెళ్లబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 2సార్లు వాయిదాపడింది. దీనికి కారణం చిరంజీవి గెటప్ లాక్ అవ్వకపోవడమే. ఎట్టకేలకు అన్నపూర్ణ […]

చిరంజీవి రెడీ.. కొరటాలదే ఆలస్యం
X

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి చేయాల్సిన సినిమా ప్రారంభమై చాన్నాళ్లయింది. సైరా విడుదలైన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకొస్తుందని అంతా అనుకున్నారు.

కానీ సైరా రిలీజ్ అవ్వడం, వెళ్లిపోవడం అన్నీ జరిగిపోయాయి కానీ ఇది మాత్రం ఇంకా మొదలవ్వలేదు. ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది. జనవరి 2 నుంచి చిరంజీవి-కొరటాల సెట్స్ పైకి వెళ్లబోతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 2సార్లు వాయిదాపడింది. దీనికి కారణం చిరంజీవి గెటప్ లాక్ అవ్వకపోవడమే. ఎట్టకేలకు అన్నపూర్ణ స్టుడియోస్ లో తాజాగా చిరంజీవిపై నిర్వహించిన లుక్ టెస్ట్ లో ఓ గెటప్ ను లాక్ చేశారు. దీంతో రెగ్యులర్ షూటింగ్ కు మార్గం సుగమం అయింది. ఈ సినిమా కోసం కోకాపేట సమీపంలో భారీ ఇంటి సెట్ వేశారు. ఆ సెట్ లోనే ఫస్ట్ షెడ్యూల్ మొదలవుతుంది.

ఈ సినిమాకు మణిశర్మ సంగీత దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలుపెట్టారు. త్రిష హీరోయిన్ గా ఎంపికైంది. వచ్చే ఏడాది ఆగస్ట్ 14న సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు.

First Published:  27 Dec 2019 1:05 AM GMT
Next Story