Telugu Global
NEWS

నాలుగేళ్ల తర్వాత భారతజట్టులో సానియా

ఫెడరేషన్ కప్ జట్టులో సానియాకు చోటు భారత టెన్నిస్ డబుల్స్ క్వీన్ సానియా మీర్జా నాలుగు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి భారత టెన్నిస్ జట్టులో చోటు సంపాదించింది. ఓ బిడ్డకు జన్మనివ్వడం కోసం రెండేళ్ల క్రితం టెన్నిస్ కు దూరమైన గ్రాండ్ స్లామ్ మాజీ విన్నర్ సానియా రీ-ఎంట్రీకి ఎదురుచూస్తోంది. ప్రపంచ మహిళల టీమ్ టెన్నిస్ విజేతలకు ఇచ్చే ఫెడరేషన్ కప్ లో పాల్గొనే ఐదుగురు సభ్యుల భారతజట్టులో సానియా తిరిగి చోటు సంపాదించింది. […]

నాలుగేళ్ల తర్వాత భారతజట్టులో సానియా
X
  • ఫెడరేషన్ కప్ జట్టులో సానియాకు చోటు

భారత టెన్నిస్ డబుల్స్ క్వీన్ సానియా మీర్జా నాలుగు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి భారత టెన్నిస్ జట్టులో చోటు సంపాదించింది.

ఓ బిడ్డకు జన్మనివ్వడం కోసం రెండేళ్ల క్రితం టెన్నిస్ కు దూరమైన గ్రాండ్ స్లామ్ మాజీ విన్నర్ సానియా రీ-ఎంట్రీకి ఎదురుచూస్తోంది.

ప్రపంచ మహిళల టీమ్ టెన్నిస్ విజేతలకు ఇచ్చే ఫెడరేషన్ కప్ లో పాల్గొనే ఐదుగురు సభ్యుల భారతజట్టులో సానియా తిరిగి చోటు సంపాదించింది.

2016 లో చివరిసారిగా ఫెడరేషన్ కప్ లో భారత్ తరపున బరిలోకి దిగిన సానియా 2017 అక్టోబర్ నుంచి కుటుంబం కోసం విరామం తీసుకొన్న సంగతి తెలిసిందే.

భారత టాప్ ర్యాంకర్ అంకిత్ రైనా, రియా భాటియా ( 379 ), రుతుజా భోంశ్లే ( 466 ), కర్మాన్ కౌర్ తండీ ( 568 ) సభ్యులుగా ఉన్నా భారత మహిళాజట్టుకు సానియా తన అపార అనుభవంతో పెద్దదిక్కుగా నిలువనుంది.

డేవిస్ కప్ మాజీ ప్లేయర్ విశాల్ ఉప్పల్ కెప్టెన్ గాను, అంకిత బాంబ్రీ కోచ్ గాను భారత ఫెడరేషన్ కప్ జట్టుకు నాయకత్వం వహించనున్నారు.

ఉక్ర్రేనియా ప్లేయర్ నాడిలా కిచనోక్ తో జంటగా సానియా టెన్నిస్ రీ-ఎంట్రీకి ప్రణాళికలు సిద్ధం చేసుకొంది. హోబర్ట్ ఇంటర్నేషనల్ టోర్నీ ద్వారా పునరాగమనం చేయాలన్న పట్టుదలతో ఉంది.

సానియాకు మూడు గ్రాండ్ స్లామ్ డబుల్స్, మూడు మిక్సిడ్ డబుల్స్ టైటిల్స్ సాధించిన అరుదైన రికార్డు ఉంది.

First Published:  25 Dec 2019 12:40 AM GMT
Next Story