Telugu Global
Cinema & Entertainment

వేలాదిగా వచ్చిన మహేష్ అభిమానులు... తొక్కిసలాట

హైదరాబాద్ గచ్చిబౌలి సమీపంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో మహేష్ బాబు అభిమానులు పలువురు గాయపడ్డారు. ఇద్దరికి కాళ్లు విరిగాయి. దాంతో వారిని ఆస్పత్రికి తరలించారు. మహేష్‌బాబు ఫోటో షూట్ ఉందని.. అభిమానులంతా భారీగా తరలిరావాలంటూ ఏకే ఎంటర్‌టైన్మెంట్ సంస్థ ఆన్‌లైన్‌లో పిలుపునిచ్చింది. దాంతో వేలాది మంది మహేష్ బాబు అభిమానులు తరలి వచ్చారు. ఈ షూట్‌కు సంబంధించి ముందస్తు సమాచారం కూడా నిర్వాహకులు పోలీసులకు ఇవ్వలేదు. దాంతో ఒక్కసారిగా వేలాది మంది రావడంతో తొక్కిసలాట జరిగింది. […]

వేలాదిగా వచ్చిన మహేష్ అభిమానులు... తొక్కిసలాట
X

హైదరాబాద్ గచ్చిబౌలి సమీపంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో మహేష్ బాబు అభిమానులు పలువురు గాయపడ్డారు. ఇద్దరికి కాళ్లు విరిగాయి. దాంతో వారిని ఆస్పత్రికి తరలించారు.

మహేష్‌బాబు ఫోటో షూట్ ఉందని.. అభిమానులంతా భారీగా తరలిరావాలంటూ ఏకే ఎంటర్‌టైన్మెంట్ సంస్థ ఆన్‌లైన్‌లో పిలుపునిచ్చింది. దాంతో వేలాది మంది మహేష్ బాబు అభిమానులు తరలి వచ్చారు.

ఈ షూట్‌కు సంబంధించి ముందస్తు సమాచారం కూడా నిర్వాహకులు పోలీసులకు ఇవ్వలేదు. దాంతో ఒక్కసారిగా వేలాది మంది రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనకు కారణమైన ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

First Published:  25 Dec 2019 3:41 AM GMT
Next Story