Telugu Global
NEWS

దిగ్గజాల సరసన జిమ్మీ యాండర్సన్

150 టెస్టుల క్లబ్ లో ఇంగ్లండ్ స్టార్ బౌలర్ ఇంగ్లండ్ ఎవర్ గ్రీన్ స్వింగ్ బౌలర్ జేమ్స్ యాండర్సన్ ఓఅరుదైన మైలురాయిని చేరుకోడానికి సిద్ధమయ్యాడు. క్రికెట్ దిగ్గజాలు మాస్టర్ సచిన్ టెండుల్కర్, స్టీవ్వా, జాక్ కలిస్ ల సరసన చేరడానికి తహతహలాడుతున్నాడు. గాయంతో గత కొద్దిమాసాలుగా క్రికెట్ కు దూరమై పునరావాస కార్యక్రమాలతో తిరిగి పూర్తి ఫిట్ నెస్ సాధించిన ఈ స్టార్ బౌలర్ తన కెరియర్ లో 150వ టెస్ట్ మ్యాచ్ ఆడటానికి ఉరకలేస్తున్నాడు. సౌతాఫ్రికాతో జరిగే బాక్సింగ్ […]

దిగ్గజాల సరసన జిమ్మీ యాండర్సన్
X
  • 150 టెస్టుల క్లబ్ లో ఇంగ్లండ్ స్టార్ బౌలర్

ఇంగ్లండ్ ఎవర్ గ్రీన్ స్వింగ్ బౌలర్ జేమ్స్ యాండర్సన్ ఓఅరుదైన మైలురాయిని చేరుకోడానికి సిద్ధమయ్యాడు. క్రికెట్ దిగ్గజాలు మాస్టర్ సచిన్ టెండుల్కర్, స్టీవ్వా, జాక్ కలిస్ ల సరసన చేరడానికి తహతహలాడుతున్నాడు.

గాయంతో గత కొద్దిమాసాలుగా క్రికెట్ కు దూరమై పునరావాస కార్యక్రమాలతో తిరిగి పూర్తి ఫిట్ నెస్ సాధించిన ఈ స్టార్ బౌలర్ తన కెరియర్ లో 150వ టెస్ట్ మ్యాచ్ ఆడటానికి ఉరకలేస్తున్నాడు.

సౌతాఫ్రికాతో జరిగే బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ ద్వారా ఈ స్వింగ్ బౌలింగ్ కింగ్ రీ-ఎంట్రీకి సిద్ధమయ్యాడు. 2003లో జింబాబ్వే ప్రత్యర్థిగా క్రికెట్ మక్కా లార్డ్స్ స్టేడియంలో టెస్ట్ అరంగేట్రం చేసిన యాండర్సన్ గత 16 సంవత్సరాలుగా ఇంగ్లండ్ తరపున టెస్ట్ మ్యాచ్ లు ఆడుతూనే వస్తున్నాడు.

37 సంవత్సరాల జేమ్స్ యాండర్సన్ కు 575 వికెట్లు సాధించిన ఘనత ఉంది. ఇంగ్లండ్ టెస్ట్ చరిత్రలోనే అత్యధిక టెస్ట్ వికెట్లు పడగొట్టిన ఫాస్ట్ కమ్ స్వింగ్ బౌలర్ గా యాండర్సన్ కు గుర్తింపు ఉంది.

2021 యాషెస్ సిరీస్ వైపు చూపు…

ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా సౌతాఫ్రికాతో సిరీస్ తర్వాత…ఆస్ట్ర్రేలియా గడ్డపై కంగారూలతో జరిగే 2021 యాషెస్ సిరీస్ లో సైతం యాండర్సన్ పాల్గోనున్నాడు.

టెస్ట్ చరిత్రలో 150కి పైగా మ్యాచ్ లు ఆడిన మాస్టర్ సచిన్ టెండుల్కర్, ఆస్ట్ర్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా, సఫారీ సూపర్ ఆల్ రౌండర్ జాక్ కలిస్ తో సహా తొమ్మిదిమంది దిగ్గజ క్రికెటర్ల సరసన చేరబోతున్నాడు.

భారత క్రికెటర్ సచిన్ టెండుల్కర్ కు మాత్రమే 200 టెస్టు మ్యాచ్ లు ఆడిన అసాధారణ రికార్డు ఉంది.

First Published:  25 Dec 2019 12:50 AM GMT
Next Story