Telugu Global
National

విజయసాయి రెడ్డి ఫిర్యాదు పై స్పందించిన రాష్ట్రపతి

రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఆర్థిక నేరాలపై, ఆయన అక్రమ కంపెనీలపై, ఆయన మనీ లాండరింగ్‌ వ్యవహారాలపై, అంతర్జాతీయ స్థాయిలో ఆయన పాల్పడ్డ వ్యాపార కుంభకోణాలపై విజయసాయి రెడ్డి భారత రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తూ ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన సుజనా చౌదరి అక్రమ వ్యవహారాలపై ఈడీ, సీబీఐ చేత ధర్యాప్తు చేయించాలని కోరారు. ఆ లేఖకు స్పందించిన రాష్ట్రపతి దానిని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపారు. సాక్షాత్తూ రాష్ట్రపతి నుంచే విజయసాయి […]

విజయసాయి రెడ్డి ఫిర్యాదు పై స్పందించిన రాష్ట్రపతి
X

రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఆర్థిక నేరాలపై, ఆయన అక్రమ కంపెనీలపై, ఆయన మనీ లాండరింగ్‌ వ్యవహారాలపై, అంతర్జాతీయ స్థాయిలో ఆయన పాల్పడ్డ వ్యాపార కుంభకోణాలపై విజయసాయి రెడ్డి భారత రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తూ ఒక లేఖ రాశారు.

ఆ లేఖలో ఆయన సుజనా చౌదరి అక్రమ వ్యవహారాలపై ఈడీ, సీబీఐ చేత ధర్యాప్తు చేయించాలని కోరారు.

ఆ లేఖకు స్పందించిన రాష్ట్రపతి దానిని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపారు.

సాక్షాత్తూ రాష్ట్రపతి నుంచే విజయసాయి రెడ్డి లేఖ… రాష్ట్రపతి కార్యాలయం నోట్‌తో రీ-డైరెక్ట్‌ కావడంతో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆ లేఖను సంబంధిత శాఖలకు పంపింది.

విజయసాయి రెడ్డి లేఖకు స్పందించి విచారణ ప్రారంభం అయితే సుజనా చౌదరి ఇబ్బందుల్లో పడడం ఖాయం. అయితే ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆయనపై కేంద్రం విచారణకు ఆదేశిస్తుందా?లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Next Story